Minister Jayaram: అడ్డంగా బుక్కైన మంత్రి జయరాం

Minister Jayaram: ఏపీ క్యాబినేట్ డమ్మీ అన్న అపవాదు ఉంది. ఒకరిద్దరకు తప్పితే తమ శాఖలపై పట్టులేదన్న ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే అంతా నవరత్నాల పంచుడు నేపథ్యంలో మంత్రులకు పట్టులేకపోయినా ఏం పర్వాలేదు. కానీ కొందరు మంత్రులు పవర్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. శాఖలపరంగా పనులు లేకపోవడంతో రియల్ ఎస్టేట్, ఇతరత్రా పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిపై ఫోకస్ పెంచారు. ముందుగా వివాదాస్పద భూములపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. కారుచౌకగా కొట్టేసి కుటుంబసభ్యులు, బంధువుల […]

Written By: Dharma, Updated On : March 3, 2023 11:49 am
Follow us on

Minister Jayaram

Minister Jayaram: ఏపీ క్యాబినేట్ డమ్మీ అన్న అపవాదు ఉంది. ఒకరిద్దరకు తప్పితే తమ శాఖలపై పట్టులేదన్న ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే అంతా నవరత్నాల పంచుడు నేపథ్యంలో మంత్రులకు పట్టులేకపోయినా ఏం పర్వాలేదు. కానీ కొందరు మంత్రులు పవర్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. శాఖలపరంగా పనులు లేకపోవడంతో రియల్ ఎస్టేట్, ఇతరత్రా పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిపై ఫోకస్ పెంచారు. ముందుగా వివాదాస్పద భూములపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. కారుచౌకగా కొట్టేసి కుటుంబసభ్యులు, బంధువుల పేరిట రాయించుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. కేబినెట్ లో బెంజ్ మంత్రిగా పేరొందిన గుమ్మనూరు జయరాం తన కుటుంబసభ్యులు, బంధువులు ఒకేరోజు 180 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనిని గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ ఆ ఆస్తులను ఎందుకు అటాచ్ చేయకూడదని నోటీసులిచ్చింది. దీనిపై సమాధానం చెప్పాలని నేరుగా మంత్రి కుటుంబసభ్యులకే నోటీసులు పంపించడం ప్రాధన్యం సంతరించుకుంది.

అయితే అనూహ్యంగా కేబినెట్ మంత్రి ఐటీ శాఖ గుప్పెట్లో చిక్కుకోవడం జగన్ సర్కారుకు మాయని మచ్చగా మిగులుతోంది. జయరాం మంత్రి అయిన తరువాత కొనుగోలు చేసిన భూములన్నీ బినామీవేనని గుర్తించిన ఐటీ శాఖ మొత్తం ఆస్తులను జప్తు చేసింది. మొత్తం 90 ఎకరాలను టేకోవర్ చేసుకొని జప్తులో పెట్టారు. ఆయన భార్య రేణుకమ్మ పేరు మీద ఉన్న 30 ఎకరాలను సైతం తాత్కాలికంగా అటాచ్ చేశారు. పూర్తిగా ఎందుకు జప్తు చేయకూడదో ఈ నెల 17లోగా సమాధానం చెప్పాలని ఐటీ శాఖ నోటీసులిచ్చింది. అయితే ఆ భూములు అన్యాక్రాంతం, బదిలీ చేయవద్దంటూ రిజిస్ట్రేషన్ శాఖకు ఐటీ అధికారులు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వాస్తవానికి జయరాం గత ఎన్నికల్లో పోటీచేసినప్పుడు అఫిడవిట్ సమర్పించారు. తన వద్ద కేవలం రూ.19 వేలు నగదు మాత్రమే ఉందని.. అంతకు మించి తన కుటుంబానికి ఎటువంటి ఆస్తులు లేవని పేర్కొన్నారు. కానీ ఒకే రోజు తన భార్య రేణుకమ్మతో పాటు కుటుంబసభ్యుల పేరిట 180 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఒకే రోజున వారిపేరిట రిజిస్ట్రేషన్ కావడంతో ఆదాయపు పన్ను అధికారులు అలెర్టయ్యారు. అధికార బలంతో భూములను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అందుకే అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Minister Jayaram

మంత్రి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన భూములన్ని ఓ కంపెనీ ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరించినవి. ఇట్టినా అనే కంపెనీ ఏర్పాటుకుగాను రైతుల వద్ద నుంచి 450 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మబలికి ఆ భూమునుల స్వాధీనం చేసుకుంది. కానీ పరిశ్రమ ఏర్పాటుచేయలేదు. ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి దక్కలేదు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల ప్రచారంలో ఆ భూములన్నింటినీ తిరిగి రైతులకే ఇప్పిస్తామని జయరాం ఊరూ వాడా ప్రచారం చేశారు. ఎమ్మెల్యే, ఆ పై మంత్రి అయ్యేసరికి అందులో సగం భూములు మంత్రి భార్య, కుటుంబసభ్యలుకు రిజిస్టరై పోయాయి. అయితే అనూహ్యంగా ఐటీ శాఖ తెరపైకి రావడం నివ్వెరపరుస్తోంది. మంత్రి స్థాయి కంటే పెద్ద వ్యక్తులు ఆ భూములపై కన్నేసినందునే జయరాంపై పట్టుబిగుస్తున్నారన్న టాక్ వ్యాపిస్తోంది.

Tags