KTR WhatsApp Account Blocked: మోసపూరిత కాల్స్, సందేశాలను పంపించే నెంబర్లను వాట్సాప్ సంస్థ బ్లాక్ చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ తెలంగాణ రాష్ర్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు నెంబర్ ను కూడా బ్లాక్ చేయడం సంచలనం కలిగిస్తోంది. దీంతో ఆయనకు వచ్చే సందేశాలు కనిపించలేదు. నెంబర్ బ్లాక్ కావడంతో ఇక సందేశాలు ఎలా కనిపిస్తాయి. దీన్ని స్పామ్ అంటారు. ఇలా మంత్రి నెంబరే స్పామ్ కావడంతో అందరిలో కంగారు మొదలైంది. మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో కిందపడిపోవడంతో కాలుకు గాయమైంది. వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఆయన ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వాట్సాప్ లో సందేశాలు చూసే సమయంలో ఒక్కసారిగా నెంబర్ స్పామ్ కావడంతో ఏం చేయాలో కూడా తోచలేదు.
మనకు అవసరం లేకపోయినా కొన్ని సందేశాలు, ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాటితో మనకు ప్రయోజనం లేకున్నా నెలకు కనీసం ఓ ఇరవై వరకు రావడం సహజమే. దీంతో మనకు విసుగొస్తుంది. వాట్సాప్ సంస్థ కూడా వీటిని దూరం చేయాలనే ఉద్దేశంతో మోసపూరిత సందేశాలు, కాల్స్ ను పంపించే సంస్థలపై అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారు పంపే వాటిని వినియోగదారులకు చేరకుండా ఉండేందుకు కొన్ని నెంబర్లను స్పామ్ చేస్తోంది. ఇందులో అనుకోకుండా మంత్రి నెంబర్ ఉండటంతో మంత్రికి రావాల్సిన సందేశాలు రాలేదు. దీంతో ఏం జరిగిందో అనే అనుమానం అందరిలో వచ్చింది. చివరకు తెలుసుకుని మళ్లీ సరిచేసేందుకు వాట్సాప్ ప్రతినిధులు ప్రయత్నించారు.
Also Read: Film Shooting Is Closed: సినిమా షూటింగ్ ల బంద్..: ఎవరికి నష్టం..?
మంత్రి అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఒక్క రోజే ఎనిమిది వేల మెసేజ్ లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ని సందేశాలు వచ్చే మంత్రి నెంబర్ బ్లాక్ కావడంతో ఆందోళన పెరిగింది. అందరు యోగక్షేమాలు తెలుసుకునేందుకు వాట్సాప్ సందేశాల ద్వారా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కానీ మంత్రి నెంబర్ అందుబాటులో లేక ఇక్కట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మంత్రి ట్విటర్ ద్వారా తెలియజేశారు. వాట్సాప్ సంస్థ తన నెంబర్ బ్లాక్ చేసిందని గుర్తించారు. దీంతో ప్రతినిధుల్లో ఆందోళన పెరిగింది.
ఇంటి నుంచే విధులు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. వాట్సాప్ సందేశాల ద్వారా పనులు చక్కబెడుతున్నారు. ఫైళ్లను పరిశీలిస్తున్నారు. గాయంతో ఇంటికే పరిమితమైన కేటీఆర్ ఫోన్ ద్వారానే పనులు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో పనులు పెండింగ్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. పనులు ఆగకుండా చూసుకుంటూ అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వాట్సాప్ సందేశాలు కాస్త ఇబ్బంది పెట్టడంతో పనులు కాస్త నెమ్మదించినా స్పామ్ తొలగించడంతో పనులు యథావిధిగా నడిచాయి.
Also Read: Jagan- Debts: అప్పులను నియంత్రిస్తే జగన్ పరిస్థితి ఏమిటి?