Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: కేసీఆర్‌కు గెలుపు అత్యవసరం.. అందుకే స్వరం మారిందా?

Telangana Elections 2023: కేసీఆర్‌కు గెలుపు అత్యవసరం.. అందుకే స్వరం మారిందా?

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది రోజులే గడువు ఉంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2014, 2018లో గెలిచిన బీఆర్‌ఎస్‌.. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. అయితే.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమలు అనుకూలంగా మార్చుకుని గులాబీ పార్టీని గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు జరుగుతోంది. సర్వేలు బీఆర్‌ఎస్‌కు కాస్త అనుకూలంగా ఉన్నా.. జనం నాడి మాత్రం మార్పు కోరుకుంటోందని తెలుస్తోంది. చాలా మంది కాంగ్రెస్‌వైపు చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీజేపీ బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చడం, పంటల మద్దతు ధర రూ.1000 పెంపు, మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు అంటి అంశాలు ఆలోచింపజేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఓట్లను బీజేపీ చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది.

గెలవకుంటే ఖతమే..
ముక్కోణపు పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్‌కు ఈసారి గెలవడం కత్తిమీద సాములా మారింది. మరోవైపు ఈ ఎన్నికలు గులాబీ పార్టీకి చావో రేవోగా మారాయని విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీకి ఈ పరిస్థితి ఏంటా అంటే.. జాతీయ పార్టీలు అధికారంలోకి వస్తే.. బీఆర్‌ఎస్‌ను కమ్మేయడం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బీఆర్‌ఎస్‌ ఓడితే పార్టీ చీలిపోవడమే కాకుండా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పరాభవంతోపాటు జాతీపార్టీగా జెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది.

ఓడితో ఇదీ పరిస్థితి..
దేశంలో ప్రాంతీయ పార్టీలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒక్క జేడీఎస్, ఎస్సీ, వైసీపీ, బీఆర్‌ఎస్, డీఎంకే మాత్రమే కాస్త నిలదొక్కుకున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలను చిదిమేస్తున్నాయి. ఇందుకు అనేక రాష్ట్రాలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కూలిపోవడమే ఇందుకు నిదర్శనం. మొన్నటికి మొన్న కర్ణాటకలో జేడీఎస్‌ పరిస్థితి అలాగే తయారైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారంలోకి వస్తామని, కనీసం కీలక పాత్ర పోషిస్తామని భావించిన కుమారస్వామి ఎన్నికల తర్వాత జాతీయ పార్టీ బీజేపీ పంచన చేరాల్సిన పరిస్థితి వచ్చింది. బీహార్‌లో ఆర్జేడీ పరిస్థితి కూడా అలాగే ఉంది. మొన్నటి వరకు బీజేపీతో, ప్రస్తుతం కాంగ్రెస్‌తో అంటకాగుతోంది. మహారష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ కూడా అంతే. శివసేన చీలిక వర్గంవ బీజేపీ వైపు ఉంటే.. పాత శివసేన ఎన్‌సీపీ కాంగ్రెస్‌వైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఈసారి బీఆర్‌ఎస్‌ ఓడితే.. ఆ పార్టీ కూడా జాతీయ పార్టీల పంచన చేరాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో 2029లో వచ్చే ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతాయి. అపుపడు బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీలు ఇచ్చే సీట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.

స్వరం మార్చిన గులాబీ బాస్‌..
ఓడితే తన భవిష్యత్‌ ఏంటో గులాబీ బాస్‌కు స్పష్టంగా ఆయన కళ్ల ముందు కనిపిస్తోంది. పార్టీ ఏమైపోతుందో ఆయనకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభల్లో ఇన్నాళ్లూ కాంగ్రెస్, బీజేపీలను ధూషిస్తూ వచ్చిన గులాబీ బాస్‌.. ఇప్పుడు స్వరం మార్చారు. తిట్లతో ఒరిగేది ఏమీ ఉండదని అర్థం చేసుకున్నారు. చేసిన పని చెప్పుకుంటూ ఓట్లు అడగడమే మేలని డిసైడ్‌ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జాతీయ అంశాలను వదిలేసి రాష్ట్రంలో చేసింది చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటోల ఫిట్‌నెస్‌ రద్దు చేస్తామని, రైతుల రుణమాఫీ చేస్తామని కొత్త రాగం అందుకున్నారు.

మొత్తంగా బీఆర్‌ఎస్‌ బలహీన పడుతున్న నేపథ్యంలో గులాబీ బాస్‌లో గుబులు మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారా లేదా అన్నది డిసెంబర్‌ 3న తేలనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular