https://oktelugu.com/

రోజాకు మంత్రి పదవి కష్టమే.. కారణం ఇదే..

ఆర్కే రోజా వైసీపీలో గ్లామర్ ఎమ్మెల్యేలలో ఒకరు. మంచి పేరు, వరుస విజయాలతో ప్రజలకు చేరువయ్యారు. అయితే కొంతకాలంగా రోజా సొంతపార్టీలోనే శత్రువులతో ఇబ్బందులు పడుతున్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నేతలుగా బలంగా మారారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజాను కాదని వారు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వైసీపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలనే తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని రోజా సైతం పదేపదే ఆరోపిస్తున్నా.. అధిష్టానానికి ఫిర్యాదు […]

Written By: Srinivas, Updated On : March 24, 2021 12:29 pm
Follow us on

RK Roja
ఆర్కే రోజా వైసీపీలో గ్లామర్ ఎమ్మెల్యేలలో ఒకరు. మంచి పేరు, వరుస విజయాలతో ప్రజలకు చేరువయ్యారు. అయితే కొంతకాలంగా రోజా సొంతపార్టీలోనే శత్రువులతో ఇబ్బందులు పడుతున్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నేతలుగా బలంగా మారారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజాను కాదని వారు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వైసీపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలనే తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని రోజా సైతం పదేపదే ఆరోపిస్తున్నా.. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నా.. పట్టించుకునేవారు కరువయ్యారు.

నగరి నియోజకవర్గాన్ని రోజా తన కంచుకోటగా మార్చుకున్నారు. 2014,19 ఎన్నికల్లో రోజా వరుసగా విజయం సాధించి.. పార్టీలో, నగరిలోనూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా నగరి నియోజకవర్గంలో బలంగా ఉంది. గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తరువాత బలహీనం అవుతుందనుకున్న టీడీపీ తిరిగి నగరిలో పుంజుకుంది. కానీ టీడీపీ కన్నా రోజాకు సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందిగా మారింది.

సొంతపార్టీలోని ఒకవర్గం రోజాకు వ్యతిరేకంగా పని చేస్తోంది. ఈ వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. తన నియోజకవర్గానికి పదవులు దక్కకుండా అడ్డుకోవడంలోనూ రోజా విఫలం అయ్యారు. దీనిపై నేరుగా జగన్ కే రోజా పలుమార్లు ఫిర్యాదు చేసినా.. సర్దుకుపోవాలని చెప్పడంతో కొంతకాలంగా రోజా మౌనంగా ఉంటున్నారు. కేవలం మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఏకైక కారణంతోనే రోజా మౌనం పాటిస్తున్నారన్నది వాస్తవం.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రోజాకు పార్టీలో వ్యతిరేకంగా ఒకవర్గం బలంగా పని చేసింది. రెబల్స్ ను బరిలో దింపి ఆమెకు తలనొప్పులు తీసుకొచ్చింది. టీడీపీ సంగతి పక్కన పెడితే.. రోజాకు వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీనేతలే శత్రువులుగా మారే అవకాశం ఉంది. హ్యాట్రిక్ విజయాన్ని అందుకుందామనుకున్న రోజాకు సొంతం పార్టీ నేతలే షాక్ ఇచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. దీంతో నగరి నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకు పుంజుకుంటోంది. మరి రోజా హ్యాట్రిక్ ఆశలు నెరవేరుతాయా..? లేదా..? అన్నది చూడాలి.