https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..?

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 26 నాన్‌ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌, మైనింగ్‌ మెట్‌ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. పదో తరగతి, ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. Also Read: ఈ కంపెనీలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 24, 2021 / 12:28 PM IST
    Follow us on

    హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 26 నాన్‌ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌, మైనింగ్‌ మెట్‌ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. పదో తరగతి, ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

    Also Read: ఈ కంపెనీలో నెలకు రూ.7 లక్షల జీతం.. పనేంటంటే..?

    ఏప్రిల్ నెల 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లను రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. https://www.hindustancopper.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండా హెటిరో డ్రగ్స్ లో జాబ్స్..?

    మొత్తం 26 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ఉద్యోగ ఖాళీలు 11 ఉండగా మైనింగ్‌ మేట్‌ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే పదో తరగతి అభ్యర్థులకు సంబంధిత శాఖలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. మైనింగ్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా చేసిన అభ్యర్థులకు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వాలిడ్‌ మైన్స్‌ ఫోర్‌మెన్‌ సర్టిఫికేట్‌ ను కలిగి ఉండాలి.

    2021 సంవత్సరం మార్చి నెల నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయో సడలింపులు ఉంటాయి. మైనింగ్ మేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే పదో తరగతి అభ్యర్థులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. డిప్లొమా అభ్యర్థులకు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. వీళ్లు వాలిడ్‌ మైనింగ్‌ మేట్‌ సర్టిఫికేట్‌ ను కచ్చితంగా కలిగి ఉండాలి. https://www.hindustancopper.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.