https://oktelugu.com/

నాగ‌బాబు మ‌రీ అంత క్రూరుడా.. ఈ ఫొటోనే సాక్ష్యం!

మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచయ‌మైన నాగ‌బాబు.. ఆ త‌ర్వాత త‌న‌దైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. నిర్మాత‌గా మారి మంచి సినిమాలు తీశారు. ఆ త‌ర్వాత జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించి, తెలుగు ఆడియ‌న్స్ కు మ‌రింత క్లోజ్ అయ్యారు. ఆ త‌ర్వాత మ‌రో షోలో కొంత‌కాలం ఉన్న ఆయ‌న‌.. ఓ యూట్యూబ్ చాన‌ల్ ను కూడా ర‌న్ చేస్తున్నారు. ‘నా ఛానల్.. నా ఇష్టం’ అంటూ.. ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాన్ని […]

Written By:
  • Rocky
  • , Updated On : March 24, 2021 / 12:48 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచయ‌మైన నాగ‌బాబు.. ఆ త‌ర్వాత త‌న‌దైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. నిర్మాత‌గా మారి మంచి సినిమాలు తీశారు. ఆ త‌ర్వాత జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించి, తెలుగు ఆడియ‌న్స్ కు మ‌రింత క్లోజ్ అయ్యారు. ఆ త‌ర్వాత మ‌రో షోలో కొంత‌కాలం ఉన్న ఆయ‌న‌.. ఓ యూట్యూబ్ చాన‌ల్ ను కూడా ర‌న్ చేస్తున్నారు. ‘నా ఛానల్.. నా ఇష్టం’ అంటూ.. ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చేస్తుంటారు.

    Also Read: చరణ్ తో మరో స్టార్ హీరో.. త్రివిక్రమ్ కొత్త ఆలోచన !

    అయితే.. మెగాస్టార్ ‘రాక్షసుడు’ చిత్రంతో వెండి తెరపై తొలిసారిగా మెరిశారు నాగబాబు. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు. ఇప్ప‌టికీ.. సినిమాల్లో ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిస్తున్నారు నాగ‌బాబు. ఇటీవ‌ల వ‌చ్చిన ‘అర‌వింద సమేత‌’లో ఎన్టీఆర్ తండ్రి నార‌ప‌రెడ్డిగా న‌టించారు.

    కాగా.. లేటెస్ట్ గా నాగ‌బాబు ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ ఫొటోలో మెగాబ్ర‌ద‌ర్ వైల్డ్ గెట‌ప్ లో క‌నిపిస్తున్నారు. ముఖాన కత్తిగాట్లు, కోరమీసాలు, నోట్లో సిగరెట్టుతో విలన్ గెటప్ లో కనిపిస్తున్నారు. దీంతో.. అందరూ షాకయ్యారు. ఏంటీ.. నాగ‌బాబు ఇలా మారిపోయార‌ని డిస్క‌ష‌న్ స్టార్ట్ చేశారు.

    Also Read: ‘పూజా హెగ్డే’ కొత్తగా.. ఆచార్య కోసమే !

    అయితే.. ఇది నాగ‌బాబు న‌టిస్తున్న‌ బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన స్టిల్ అంటున్నారు‌! బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. జ‌క్క‌న్న-ప్ర‌భాస్‌ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఛ‌‌‌త్ర‌ప‌తి సినిమాను రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ‌. ఇందులో విల‌న్ క్యారెక్ట‌ర్లో న‌టిస్తున్నారట‌ మెగా బ్ర‌ద‌ర్‌.

    ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాగ‌బాబు మెయిన్ విల‌న్ గా న‌టిస్తున్నాడ‌ని టాక్‌. ఈ పాత్ర‌ను చాలా క్రూరంగా చూపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఫిల్మ్ న‌గ‌ర్లో ఈ మేర‌కు ఓ న్యూస్ వైర‌ల్ అయ్యింది. ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలోనూ చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి, ఇందులో నిజ‌మెంత అన్న‌ది తెలియాల్సి ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్