https://oktelugu.com/

New Party: జగన్ కు నష్టమే.. కొత్త పార్టీ దిశగా ముద్రగడ.. కాపు-బీసీ-దళిత వేదికగా..!

New Party: నవ్యాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆంధప్రదేశ్ లో ఓ కులానికి చెందిన నేత త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. మెజార్టీ సామాజిక వర్గాలకు రాజ్యాధికరమే లక్ష్యంగా ఆ కొత్త పార్టీ ఉండనుందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీని నడిపించబోయేది ఎవరు? ఆపార్టీ వల్ల ఎవరికీ రాబోయే ఎన్నికల్లో ఎవరికీ నష్టం, ఎవరికీ […]

Written By: , Updated On : December 27, 2021 / 10:27 AM IST
Follow us on

New Party: నవ్యాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆంధప్రదేశ్ లో ఓ కులానికి చెందిన నేత త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. మెజార్టీ సామాజిక వర్గాలకు రాజ్యాధికరమే లక్ష్యంగా ఆ కొత్త పార్టీ ఉండనుందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీని నడిపించబోయేది ఎవరు? ఆపార్టీ వల్ల ఎవరికీ రాబోయే ఎన్నికల్లో ఎవరికీ నష్టం, ఎవరికీ లాభం చేకూరుతుందనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.

Mudragada Padmanabham

ఏపీలో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా కాపులు బలంగా ఉండి ప్రభుత్వాలను శాసించే రీతిలో ఉన్నారు. ఈ సామాజిక వర్గం ఎన్నికల్లో ఎటువైపు మొగ్గితే ఆపార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీరి తర్వాత స్థానాన్ని బీసీలు, దళిత సామాజిక వర్గాలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూడు సామాజిక వర్గాలను ఐక్యం చేయడంతోపాటు రాజ్యాధికారమే లక్ష్యంగా చేసుకొని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది.

ముద్రగడ పద్మనాభం గతంలో కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమం చేపట్టారు. ఆయన చేపట్టిన ఉద్యమానికి కాపు సోదరులంతా మద్దతిచ్చారు. అయితే అనుహ్యంగా తుని వద్ద రైలు దగ్ధం వంటి సంఘటనలు చోటుచేసుకోవడం ఉద్యమాన్ని పక్కదారి పట్టించింది. దీంతో ఆయన  ఉద్యమాన్ని నిలిపి వేయాల్సి వచ్చింది. ముద్రగడ పోరాటం వల్లే నాడు అధికారంలో ఉన్న టీడీపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదుశాతం కాపులకు మరో ఐదుశాతం అగ్రవర్ణాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే దీనిని టీడీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. అలాగే జగన్ తన పాదయాత్రలో భాగంగా కాపులను బీసీల్లో చేర్చే అంశంపైన తేల్చేశారు. అధికారంలోకి వచ్చాక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు విధివిధానాలను ఖరారు చేశారు. అయితే కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే ముద్రగడ పద్మనాభం అప్పుడప్పుడు ప్రభుత్వానికి బహిరంగ లేఖలు రాస్తున్నారు. కొద్దిరోజులుగా ఆయన కొంతమంది ముఖ్య నేతలతో వరుస భేటీ అవుతూ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

కాపు సామాజిక వర్గంతోపాటు బీసీలు, దళితులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారనే వార్తలు విన్పిస్తున్నారు. దీనిని ఆయనతో భేటిలో పాల్గొన్న నేతలు నిర్ధారిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పవన్ కల్యాణ్ సైతం ఇలాంటి రాజకీయ సమీకరణాన్నే తెరపైకి తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ తో కలుస్తారా? అన్న చర్చ సైతం నడుస్తోంది. ముద్రగడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు జగన్ ఇటు చంద్రబాబుతో కలిసే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఇక జగన్ సర్కారు కొద్దిరోజులుగా కాపు నేతలకు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా  పదవుల్లో ప్రాధాన్యం ఇస్తోంది. మరోవైపు ఎస్సీ మైనార్టీలంతా జగన్ వైపే చూస్తున్నారు. దీనికితోడు బీసీ వర్గం చంద్రబాబు వైపు తిరిగి వెళ్లకుండా జగన్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కాపులను పూర్తిస్థాయి ఓటు బ్యాంకుగా జనసేన మలుచుకోలేక పోతుంది. ఈనేపథ్యంలోనే ముద్రగడ ఏర్పాటు చేయబోయే పార్టీ జగన్ కు నష్టం చేకురుస్తుందా? లేదంటే కాపు ఓట్లను చీల్చి ఆయనకు మేలు చేస్తుందా? అనే చర్చ నడుస్తోంది.