Chanakya Niti: ఆచార్య చాణక్యుడు వంటి గొప్ప వారి నీతి సూక్తులు గురించి అందరికీ తెలిసిందే. చాణక్యుడు స్వతహాగా ఉపాధ్యాయుడు కావడంతో ఆయనకు విద్య ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు. అపర మేధావిగా కీర్తి గడించిన ఆచార్య చాణక్యుడు… విద్య పట్ల ఆయన అపారమైన గౌరవాన్ని కలిగి ఉంటాడు. ఈ మేరకు ఎన్నో గ్రంథాలు ఆయన రచించడం జరిగింది. వాటిలో మనిషి జీవితం, నడవడిక, విజయ మార్గాలు, వంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆ గ్రంధాల్లో విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి అనేక కీలక సూచనలు కూడా చేశారు.
మనిషి జీవితంలో విద్యార్ధి దశ చాలా కీలకమైంది. వారి భవిష్యత్ బంగారుమయం కావాలంటే అందుకు పునాది వేసేది విద్యార్ధి దశే. ఈ మేరకు విద్యార్ధులు తమ విద్యకు సంబంధించి పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని చాణక్యుడు సూచించారు. వాటిని పాటించడం ద్వారా విద్యార్ధులు తమ భవిష్యత్తుకు మంచి బాట వేసుకోగలరని వివరించారు. ఆ సూచనలు ఎంతో మీకోసం ప్రత్యేకంగా…
జ్ఞానం, విద్య లేకుండా జీవితంలో విజయం సాధించడం అసాధ్యం. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా జ్ఞానాన్ని పొందాలని, దీని కోసం, ఎంత విలువైన వస్తువును అయినా త్యాగం చేయాల్సి వస్తే వెనుకాడొద్దని చాణక్యుడు చెప్పారు.
మనిషికి మంచి – చెడుల మధ్య తేడాను చెప్పేది విద్య. విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోని అభ్యసించాలి. విద్యాభ్యాసం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తికి జీవితంలో ఆటంకాలు, కష్టాలు ఎప్పటికీ తీరవు.
Also Read: Chanakya Niti: పిల్లల ముందు ఇలా ప్రవర్తిస్తున్నారా.. తల్లిదండ్రులు లైఫ్ లాంగ్ బాధ పడాల్సిందే?
విద్యను స్వీకరించడంలో క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ లేకుండా పూర్తి విద్యను పొందడం సాధ్యం కాదు. అలాగే, చెడు సహవాసం మీ చదువుకు పెద్ద అడ్డంకి. అందుకే చెడు సాంగత్యాన్ని వదిలేయాలి.
గురువు నుండి జ్ఞానాన్ని పొందే విషయంలో ఎప్పుడూ వెనుకాడకూడదు. జ్ఞానాన్ని తీసుకోవడానికి సిగ్గుపడే, సంకోచించే వ్యక్తి జ్ఞానం అసంపూర్ణంగా ఉంటుంది. ఆ అసంపూర్ణ జ్ఞానం ఏమాత్రం ఉపయోగపడదు.
Also Read: Chanakya Niti: చాణక్య నీతి: ఈ నాలుగు విషయాలలో సరిగ్గా ఉంటే కష్టాలు రావు!