
YS Avinash Reddy Arrested: ఏపీ సీఎం జగన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎన్నడూలేని విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇదంతా పాలనలోనూ, పార్టీని నడిపించడంలో కాదు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో. సాధారణంగా ఎదుటి వారి వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిస్తే.. అటువంటి వారిని జగన్ పక్కనపెడతారు. ఎంతోమంది అధికారులు, నేతలను ఇలానే సైడ్ చేశారు. అయితే వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కుటుంబాన్ని మాత్రం వెనుకేసుకొస్తున్నారు. వారిని కేసు నుంచి బయటపడేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆది నుంచి ఆరోపణలున్నాయి. భార్య తరుపు బంధువులు కావడం వల్లే అలా చేస్తున్నారంటే పొరబడినట్టే. ఇప్పటికే ప్రజల్లోనూ, చివరికి పార్టీలోనూ ఈ అంశం కుదిపేస్తోంది. అయినా సరే జగన్ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు కానీ అవినాష్ రెడ్డిని సీబీఐకి అరెస్ట్ …తీగ లాగితే ఇరుక్కుపోయేది తానేనని జగన్‌కు తెలుసు కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కానీ దూకుడు మీద ఉన్న సీబీఐ ఈరోజే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందన్నప్రచారం జోరుగా సాగుతోంది.
ఎన్నో అంశాలపై క్లారిటీ..
అయితే వివేకా హత్య కేసులో చిక్కుముళ్లకు ఎన్నడో సమాధానం దొరికిపోయింది.తన తండ్రి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్న సునీత ఎన్నో మిస్టరీలకు సమాధానం చెప్పేశారు. హత్యకేసు విషయమై మాట్లాడేందుకు పలుమార్లు సోదరుడు జగన్ ను కలిసినట్టు ఇంతకు ముందు చెప్పారు. కేసు కొలిక్కి తేవడానికి జగన్ ఒప్పుకోలేదని సీబీఐకి సునీత వివరణ ఇచ్చారు. ఒకానొక దశలో డీజీపీ ద్వారా పోలీసు వ్యవస్థను కూడా ప్రభావితం చేశారని కూడా ఆరోపించారు. ఈ కేసు ముందుకెళితే ఏమవుతుంది? అవినాష్ రెడ్డి బీజేపీలోచేరుతారని… తనకు పన్నెండో సీబీఐకేసు అవుతుంది తప్ప మరొకటి జరగదని అన్నట్టు సునీత చెప్పకొచ్చారు. అంటే ఇన్వాల్వ్ మెంట్ విషయంలో ఒక స్పష్టత వచ్చింది. అక్కడ అవినాష్ రెడ్డి పాత్రధారుడే.. సూత్రధారుడి విషయంలో ఒక క్లారిటీ వచ్చిందని విశ్లేషణలు వెలువడ్డాయి.
సైడ్ చేయకపోవడంతో…
తన తండ్రికి, తనకు అండగా నిలిచిన గాలి జనార్ధనరెడ్డికే జగన్ ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎవరు? అని ప్రశ్నించడం ద్వారా షాకిచ్చారు. అటువంటి వ్యక్తులతో తనకు పని ఏంటని సైడ్ అయ్యారు. అటువంటిది ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఆ సాహసం చేయడం లేదంటే జగన్ దేనికో భయపడుతున్నారు. ఒక వేళ దస్తగిరి మాదిరిగా అప్రూవర్ గా మారి క్షమాభిక్ష కోరుకుంటే.. ఎవరిని బలి పశువు చేస్తారోనన్న బెంగ వెంటాడుతున్నట్టుంది.ఈ విషయంలో అవినాష్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు పంపారు. తాను మునిగినా మిగతా వారిని ముంచేస్తానన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. వివేకా హత్యకేసు విచారణపై ఏకంగా పులివెందులలోని సీఎం క్యాంప్ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడున్న నేమ్ బోర్డులు, చిత్రపటాలు కనిపించేలా కెమెరాలు ఫిక్స్ చేసి మరీ మాట్లాడారు. ఒక విధంగా అది బెదిరింపు అని చెప్పొచ్చన్న విశ్లేషణలు వచ్చాయి.

ఇప్పుడు అదే పనిగా…
అయితే ఇప్పుడు పాలనను, పార్టీని పక్కన పెట్టి ఎంపీ అవినాష్ రెడ్డిని కేసు నుంచి పక్కన పడేయడంపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెంచారు. ఢిల్లీ పెద్దలతో వర్కవుట్ కాకపోవడంతో మరో ప్రయత్నంలో మునిగి తేలారు. కర్నాటకకు చెందిన జ్యోతిష్యుడు, లాబియిస్టు విజయ్ కుమార్ ను ప్రత్యేక విమానంలో మైసూర్ నుంచి తాడేపల్లి రప్పించారు. కీలక చర్చలు జరుపుతున్నారు. బయటపడే మార్గం చెప్పండి ప్లీజ్ అని వేడుకుంటున్నారు. అయితే ఇంతలా ఒక కేసు గురించి సీఎం పడుతున్న తాపత్రయం చూస్తుంటే ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. బాబాయ్ హత్య కేసు ఛేదనలో ఈ తాపత్రయం చేసి ఉంటే ఎవరికీ అనుమానం వచ్చి ఉండేది కాదు. కానీ హత్యకేసులో నిందితులను కాపాడుకోవడంలో చేస్తున్న అతే అందరి వెళ్లు తన వైపు చూపించేలా సీఎం కారణమవుతున్నారు.