
ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు తెలంగాణలో గుర్తింపు ఉంది. ఈ ప్రభావంతోనే తెలంగాణలో రెండుసార్లు బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. గత ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ.. ఎలాంటి ఎన్నిక జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్లుగా టీఆర్ఎస్ జెట్ స్పీడుతో దూసుకెళ్లింది.
Also Read: దుబ్బాక ఎన్నికతో చంద్రబాబు కదలిక..!
రాష్ట్రంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడానికి ముందు కూడా టీఆర్ఎస్ హవానే కొనసాగింది. అయితే కరోనా ఎంట్రీ.. వరంగల్.. హైదరాబాద్లో వరదలు.. ఎల్ఆర్ఎస్ స్కీమ్.. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోవడం.. ఇతర కారణాలతో కొంతకాలంగా టీఆర్ఎస్ పై వ్యతిరేక పవనాలు మొదలైంది. తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఇందుకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించినా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోకపోవడంపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓడిపోతే దాని నెగిటివ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ఈ ప్రభావం పార్టీకి మంచిదని కాదని కేసీఆర్ భావిస్తున్నారు.
Also Read: రఘునందన్ పై కేసీఆర్ బ్రహ్మస్త్రం పనిచేయలేదా..?
త్వరలో జరిగే వరంగల్-ఖమ్మం-నల్గొండ.. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. జీహెచ్ఎంసీ ఎన్నికలపూ ఈ ప్రభావం పడకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటమి చెందితే మంత్రులు పదవులు పోతాయనే హెచ్చరికలు జారీ చేశారనే టాక్ విన్పిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
దుబ్బాక ఫలితాన్ని బూచిగా చూపి సీఎం కేసీఆర్ పనిలో పనిలో క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. దీంతో క్యాబినెట్లోకి కొత్త ఎవరు ఎంట్రీ ఇస్తారు? ఎవరి పోస్టు ఉండనుందనే చర్చ జోరుగా సాగుతోంది. త్వరలోనే కేసీఆర్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేయనుండటంతో ఆశావహులు కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.