https://oktelugu.com/

‘గ‌మ‌నం’ ట్రైల‌ర్‌: వరదలా ఉప్పొంగిన ఎమోష‌న్‌..!

డైరెక్టర్ క్రిష్ శిష్యుడు సుజానారావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘గమ్యం’. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘గమ్యం’లో సీనియర్ హీరోయిన్ శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇటీవల శ్రియ పుట్టినరోజు ఈ మూవీకి సంబంధిన ఫస్టు లుక్ విడుదల చేశారు. ఇందులో గృహణిగా కన్పించి శ్రియ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. 2.23నిమిషాల నిడివితో ‘గమ్యం’ ట్రైలర్ రిలీజైంది. తొలి నుంచి చివరి వరకు ఫుల్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను […]

Written By: , Updated On : November 11, 2020 / 01:40 PM IST
Follow us on

gamanam

డైరెక్టర్ క్రిష్ శిష్యుడు సుజానారావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘గమ్యం’. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘గమ్యం’లో సీనియర్ హీరోయిన్ శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇటీవల శ్రియ పుట్టినరోజు ఈ మూవీకి సంబంధిన ఫస్టు లుక్ విడుదల చేశారు. ఇందులో గృహణిగా కన్పించి శ్రియ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.

2.23నిమిషాల నిడివితో ‘గమ్యం’ ట్రైలర్ రిలీజైంది. తొలి నుంచి చివరి వరకు ఫుల్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకుంది. మధ్యతరగతి జీవితాలకు బాగా కనెక్ట్ అంశాలు ఈ మూవీలో చాలా ఉన్నట్లు కన్పిస్తోంది. మూడు జీవితాలతో ‘గమనం’ మూవీ ముడిపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఓ చెవిటి ఇల్లాలు.. ఓ యువజంట ప్రేమకథ.. మ‌రో అనాథ‌ల ప్రయాణమే ‘గమ్యం’ మూవీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. గృహిణి పాత్రలో శ్రియ తనదైన శైలిలో అద్భుతంగా నటించింది. కట్టుకున్న భ‌ర్త దుబాయ్ వెళ్లిపోతే అత‌ని రాక‌కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. తనకు విన్పించకపోయినా దేవుడిని మాత్రం నిత్యం పూజిస్తుంటుంది.

అలాగే ఓ కుర్రాడు క్రికెట్ కావాలని కలలు కంటూ ఉంటాడు. తనతో అందమైన ప్రేమకథ. ఇక ఓ అనాథ తన పుట్టిన రోజు ఎప్పుడో తెలుసుకోవాలని.. బర్తేడ్ చేసుకోవాలని ఆరాటపడుతుండటం చూపించారు. ఈక్రమంలోనే న‌గ‌రంలో కురిసిన జ‌డివాన‌ వారి జీవితాల్ని ఎలా చెల్లాచెదురు చేశాయనేది ట్రైలర్లో చూపించారు. ‘గమనం’ మూవీకి బుర్రా సాయి మాధవ్ రాసిన సంభాష‌ణ‌లను సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

GAMANAM (TELUGU) Trailer| Shriya Saran|Ilaiyaraaja|Shiva Kandukuri|Priyanka Jawalkar| KRIA FILM CORP