కొత్త దరఖాస్తులు పరిశీలించవద్దు: తెలంగాణ హైకోర్టు

సాదాబైనామాల క్రమబద్దీకరణపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త దరఖాస్తులను పరిశీలించవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రెవెన్యూ చట్టానికి ముందు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించుకోవచ్చని సూచించింది. అక్టోబర్ 29 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. అదే నెల 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిపై విచారించిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 6,74,201 దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు తెలిపింది.

Written By: Suresh, Updated On : November 11, 2020 12:37 pm
Follow us on