KCR Vs Eatela: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ రకరకాల వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే జాతీయ నాయకత్వం రాష్ట్రంలో పర్యటించి కార్యకర్తల్లో జోష్ పెంచారు. ఇప్పుడిక ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి ప్లాన్ వేయాలి…? అనే ఆలోచనలో పడ్డారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ కు సముచిత న్యాయం చేయాలని పార్టీ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో ఆయనకు చేరికల కమిటీ ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇదే సమయంలో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసి గెలుస్తానని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతకు పోటీగా సువేందు అధికారి లాగే తాను కూడా కేసీఆర్ పై పోటీ చేసి గెలుస్తానని అంటున్నారు. అయితే గజ్వేల్ లో ఈటల రాజేందర్ గెలుపు అంత ఈజీ అవుతుందా..? అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ ప్రారంభం నుంచి ఉన్న ఈటల రాజేందర్ మొన్నటి ఉప ఎన్నికలతో కలిపి ఏడుసార్లు విజయం సాధించారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ మాత్రమే. అయితే కొన్ని విభేధాల నుంచి ఆయన కొన్ని నెలల కిందట పార్టీని వీడారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. అయితే ఈటలను ఓడించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు పెట్టి రకరకాల వ్యూహాలు రచించింది. అయినా ఈటల రాజేందర్ గెలిచారు. దీంతో ఆయనకు తిరుగులేదని అనిపించారు. అయితే ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం వీడి గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననడం చర్చనీయాంశంగా మారింది.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ 2014,2019లో వరుసగా గెలుపొందారు. అంతేకాకుండా సొంత నియోజకవర్గాన్ని ఆయన మోడల్ సిటీగా మార్చారు. ఒకప్పటి గజ్వేల్.. ఇప్పటి గజ్వేల్ అన్నట్లుుగా మార్చారు. ఇప్పుడు కేసీఆర్ ఎన్నికలకు వెళ్లినా ప్రచారం చేయకున్నా ఆయనకు ఓట్లు పడుతాయని స్థానిక టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ గజ్వేల్ నియోజకవర్గంలో గెలుస్తారా..? అన్న చర్చ మొదలైంది. గజ్వేల్ నియోజకవర్గ ప్రతినిధిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ప్రత్యేక ఇమేజ్ ఉన్న కేసీఆర్ ను కాదని ఈటలను ఆదరిస్తారా..? అని అనుకుంటున్నారు.
ఇక పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి వేరు. ఇక్కడ అధికారి కోసం బీజేపీ రకరకాల వ్యూహం రచించింది. మోదీ, షాలు ఇక్కడ కొన్ని రోజులపాటు స్టే చేసి మరీ ప్రచారం చేశారు. అంతేకాకుండా మమతపై పోటీ చేసిన సువేందు అధికారి టీఎంసీ నుంచి వచ్చిన నాయకుడే. అందుకే అక్కడ సువేంద్ అధికారి గెలుపొందాడని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటలను కూడా కేసీఆర్ పై పోటీ చేయించి గెలిపించాలని బీజేపీ వ్యూహం పన్నుతోంది. దీంతో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడానికి దారులు పడుతాయని ఆలోచిస్తోంది. అయితే కేసీఆర్ పై ఉన్న అభిమానం.. ఆయనన కాదని ఈటలను ఆదరిస్తుందా..? అని చర్చించుకుంటున్నారు.