Vijayashanti- KCR: ఇప్పుడంటే కేశవరావు పార్టీ జనరల్ సెక్రెటరీ. హో మంత్రి మహమ్మద్ అలీ భుజానికి దట్టి కడతారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం కావాలో తెలుసుకుంటారు. బాల్క సుమన్ మా జాతిపిత అని పొగుడుతుంటారు. కానీ వీళ్ళు ఎవరూ లేనప్పుడు తెలంగాణ భవన్లో, ఢిల్లీ తుగ్లక్ రోడ్లో వినిపించిన పేరు, కనిపించిన వారికి నోటెడ్ అయిన పేరు.. విజయశాంతి. ఔను విజయశాంతి రాజకీయాల్లోకి రాకముందు లేడీ సూపర్ స్టార్. ఆ రోజుల్లోనే రజనీకాంత్, చిరంజీవి తో సమానంగా పారితోషికం తీసుకున్న నటీమణి. “కర్తవ్యం, నేటి భారతం, ఒసేయ్ రాములమ్మ” వంటి చిత్రాలతో తిరుగులేని స్టార్ డంను అనుభవించిన దక్షిణాది నటి. అలాంటి నటి ఫేడ్ అవుట్ అయిపోయాక తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు. ఒక పార్టీని కూడా స్థాపించారు. కానీ అంతలోనే ఆ పార్టీని కేసీఆర్ పార్టీలో విలీనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో నెంబర్ టూ గా ఎదిగారు.. ఇప్పుడంటే సడ్డకుని కొడుకు సంతోష్ కేసీఆర్ కు ముందూవెనక అయ్యారు కానీ.. ఒకప్పుడు విజయశాంతి నెక్స్ట్ టు కేసీఆర్ లాగా ఉండేవారు. అంత బాగా ఉన్న వారిద్దరి మధ్య ఎందుకు పొరపచ్చాలు ఏర్పడ్డాయో ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో ఓ చిదంబర రహస్యమే.
ఆ పరిచయమే ఆసక్తి కరం
ఇప్పుడంటే కేసీఆర్ కు విజయశాంతికి పడదు కాబట్టి పరస్పరం విమర్శలు చేసుకుంటారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ఫోకస్ మొదట్లో కాంగ్రెస్ మీద ఉండేది. ఇప్పుడు బిజెపికి మళ్ళింది. విజయశాంతి పై కేసీఆర్ ఆరోపణలు చేస్తుంది చాలా తక్కువ. కెసిఆర్ అంటేనే రాజకీయాల్లో ఒక టిపికల్ క్యారెక్టర్. ఆయనకు అవసరం ఉన్నంత మేరకే ఎదుటి వ్యక్తికి గౌరవాలు లభిస్తాయి. వన్స్ తేడా కొట్టిందా అదే స్థాయిలో చీత్కారాలు లభిస్తాయి. ఓ ఆలే నరేంద్ర, రవీందర్ నాయక్, రాములు నాయక్, మాధవనేని రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. పేర్లే వేరు.. ఈ లిస్టులో విజయశాంతి కూడా ఉంది. అసలు కెసిఆర్ కు విజయశాంతికి జరిగిన పరిచయమే ఇంట్రెస్టింగ్. అప్పట్లో కెసిఆర్ కు విజయశాంతి అంటే ఎందుకు అంత మక్కువ ఉండేది? ఇప్పుడు కేశవరావు అనుభవిస్తున్న స్థానానికి ఆమె ఒకప్పుడు ఎలా వచ్చారు?
Also Read: KCR Vs Eatela: కేసీఆర్ పై ఈటల పోటీ.. అసలు కారణం ఇదేనా..?
హరీష్ రావు పరిచయం చేశారు
చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో టిఆర్ఎస్ పార్టీని పెట్టిన కేసీఆర్ కు ఆది నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. సిద్దిపేట నుంచి గెలిచినప్పటికీ దాని గాలివాటం గెలుపుగా అప్పటి నాయకులు గేలి చేసేవారు. అయినప్పటికీ ఆయనకు ప్రతి సమయంలోనూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ధైర్యాన్ని నూరిపోసేవారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావు జాదవ్ వంటి తెలంగాణవాదులంతా కెసిఆర్ వెంటే ఉండేవారు. కానీ కెసిఆర్ కున్న సపరేట్ క్యారెక్టర్ వల్ల ఎవరినీ ఎక్కువ కాలం కలుపుకొని పోయేవారు కాదు. పైగా తనకు అవసరం ఉంటేనే మాట్లాడేవారు. దీనివల్ల తెలంగాణ వాదులంతా నోచ్చుకునేవారు. ఇదే సమయంలో జయశంకర్, కేశవరావు జాదవ్ వంటి వారు చెప్పినా కేసీఆర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. సరిగ్గా ఆ సమయంలోనే విజయశాంతి ఫేడ్ అవుట్ అయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమం అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో తల్లి తెలంగాణ పేరుతో ఒక పార్టీని స్థాపించారు. కానీ తెలంగాణలో రెండు ఉద్యమ పార్టీలు ఉండటం సరికాదని అప్పట్లో కొంతమంది మేధావులు చెప్పినా విజయశాంతి వినిపించుకోలేదు. ఇదే క్రమంలో హరీష్ రావు దగ్గరికి విజయశాంతి వచ్చారు. తను కెసిఆర్ తో కలిసి పని చేయాలనుకుంటున్నానని తన మనసులో మాటను వెల్లడించారు. ఇదే అదునుగా హరీష్ రావు కేసీఆర్ వద్దకు వెళ్లి ఎలాగో మనం ఎవరినీ కలుపుకుపోవడం లేదని అపప్రద ఉన్నది కాబట్టి విజయశాంతిని మన పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. దానికి కేసీఆర్ ఓకే చెప్పారు. ఒక మనిషిని తన పార్టీలో చేర్చుకునే ముందు ఏ లాభాలు ఉంటాయో బేరీజు వేసుకునే కేసీఆర్.. విజయశాంతి విషయంలో సింగిల్ టేక్ లో ఓకే చెప్పడం ఇప్పటికీ ఆశ్చర్యకరమే.
నెంబర్ 2 స్థానాన్ని అనుభవించారు
ఎప్పుడైతే విజయశాంతి టిఆర్ఎస్ లో చేరారు అప్పుడే ఆమెకు అధిక ప్రాధాన్యం లభించింది. పైగా ఢిల్లీలోనూ ఆమెకు పలుకుబడి బాగా ఉండటంతో కెసిఆర్ కు కొన్ని పనులు జరిగాయి. దీంతో ఆమె ఏకంగా నెక్స్ట్ టు కెసిఆర్ అయ్యారు. అదే సమయంలో కేసీఆర్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగినప్పుడు విజయశాంతి హాజరై ఆయన ఎడమవైపు కూర్చున్నారు. వాస్తవానికి హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త ఎడమవైపున భార్య కూర్చుంటుంది. చూసేవారికి ఇది ఎబ్బెట్టుగా కనిపించడంతో కేసీఆర్ వెంటనే విజయశాంతిని వారించి తన కుడి వైపున కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత ఆమెను తనకు పదో సోదరిగా ప్రకటించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామలతో ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. విజయశాంతి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నతసేపు హరీష్ రావు కూడా అంతంత ప్రాధాన్యమే దక్కేది. తాను తీసుకొచ్చిన విజయశాంతి తనను మించి పోవడంతో హరీష్ రావు లో లోపల నొచ్చుకునేవారు. ఇదీ ఎంతకు సహించలేని కొంతమంది టిఆర్ఎస్ అగ్ర నాయకులు విజయశాంతికి పొమ్మన లేక కేసీఆర్ ద్వారా పొగ పెట్టించారు. ఫలితంగా రాములమ్మ బయటికి వెళ్లిపోయారు. విజయశాంతి అనంతరం ఆ స్థానాన్ని ప్రస్తుతం కేశవరావు అనుభవిస్తున్నారు. మంచి వక్త అయిన విజయశాంతి.. అంతకుమించి పలుకుబడి ఉన్న నటిమణి కూడా. కెసిఆర్ కు అవసరం ఉన్నంత సేపు ఆమెను ఎంకరేజ్ చేసేవారు. ఎప్పుడైతే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందో.. తాను చేయించుకున్న సర్వేల ద్వారా టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలుసుకున్నారు అప్పుడే విజయశాంతిని దూరం పెట్టడం ప్రారంభించారు.. దీనికి ఆ పార్టీలోని నాయకుల మాటలు కూడా జత కలిశాయి. ఫలితంగా నాడు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినప్పుడు సభలో ఉన్న విజయశాంతి.. నేడు ప్రగతి భవన్ కు కిలోమీటర్ల కొద్ది దూరంలో ఉండడం ఆశ్చర్యకరమే.
Also Read:Chandrababu: పాపం చంద్రబాబు పరిస్థితి ఏంటి ఇలా తయారైంది?