ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు తొలినాళ్ల నుంచి సినీ గ్లామర్ తక్కువనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ విడిపోవడం కూడా ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. 2019 ఎన్నికల సమయంలో చాలా తక్కువమంది సినీ ప్రముఖులు మాత్రమే వైసీపీకి మద్దతు తెలిపి ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. వైసీపీ కూడా సినీ గ్లామర్ ను ఉపయోగించుకునే దిశగా అడుగులు వేయలేదు.
Also Read : అంతర్వేది ఎఫెక్ట్.. ఓ మంత్రికి పదవ్ కట్?
వైసీపీ తరపున ప్రచారం చేసిన సినీ ప్రముఖుల్లో అలీ ఒకరు. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన అలీ అన్ని పార్టీలను సంప్రదించి వివిధ కారణాల వల్ల వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో చేరిన అలీకి జగన్ సర్కార్ ఏదో ఒక పదవిని ఇస్తుందని భారీగా ప్రచారం జరిగింది. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తైనా ఇప్పటివరకు అలీ గురించి అస్సలు పట్టించుకోలేదు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేని అలీ తాజాగా జగన్ ను కలిశారు.
జగన్ ను అలీ కలవడంలో వింతేమీ లేకపోయినా అలీ డ్రెస్ కోడ్ గురించి పార్టీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ జెండాను పోలి ఉండే డ్రెస్ ను వేసుకున్న అలీని కొందరు ప్రశంసిస్తుంటే… మరికొందరు మాత్రం పార్టీకి అలీ వీర విధేయుడు అని చెప్పుకోవడానికే ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. పార్టీ జెండాను పోలిన డ్రెస్ తో జగన్ మెప్పు పొందాలని అలీ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. అలీ జగన్ ను పదవి గురించే కలిశారని సమాచారం అందుతోంది.
అలీ మాత్రం జగన్ ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని చెబుతున్నారు. కరోనా సమయంలో ఇండస్ట్రీలోని పరిస్థితులను జగన్ కు వివరించి చెప్పానని అన్నారు. దేశంలోనే జగన్ బెస్ట్ సీఎం అంటూ అలీ ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ పాలనపై వినిపిస్తున్న విమర్శల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలీ జగన్ ను కలవడానికి అసలు కారణాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.
Also Read : దుర్గగుడి ఆ మూడు సింహాలు ఆయన ఇంట్లోనే ఉంటాయి: మాజీ మంత్రి సంచలనం