అలా వైకుంఠపురం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప, కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఇప్పటివరకు షూటింగ్ నిలిచిపోయింది. ఈ మధ్యే షూటింగ్‌లు జరుపుకునేందుకు పర్మిషన్ ఇవ్వడంతో సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.
Also Read: పెళ్లి అయ్యాక కూడా హీరో గ్యాప్ ఇవ్వట్లేదు
ఇటీవల కుంటాల జలపాతం సందర్శనకు వెళ్లిన అల్లు అర్జున్‌పై పలువురు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా.. ఇటీవల అల్లు అర్జున్ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు కొవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తూ జలపాతాన్ని సందర్శించారు. అంతేకాకుండా తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్ రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: డ్రగ్ కేసు: సుశాంత్ ఫామ్ హౌజ్లో సారా.. రియా పార్టీలు?
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఇదే విషయమై ఆదిలాబాద్ డీఎఫ్‌వో ప్రభాకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ సంఘం ప్రతినిధులు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్ స్టాఫ్‌కి వినతిపత్రం ఇచ్చారు.