బీజేపీపై కేసీఆర్ మనసు పారేసుకున్నాడా..? మొన్నటి వరకు మోదీపై విమర్శల బాణాలను సంధించిన గూలాబీ నేత ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కేసీఆర్ తాజాగా మోడీ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం. అంతకుముందు ఆయనను సెంట్రల్ విస్టాపై పొగిడి ఆ తరువాత ఆయనను కలవడానికి ఢిళ్లీ వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. దీంతో కేసీఆర్ వ్యూహ అర్థం కాక టీఆర్ఎస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
Also Read: ఆయనతో ఢీకొట్టే స్ట్రాటజీ ఉందా..?
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ బీజేపీకి మద్దతుగానే ఉంటూ వస్తున్నారు. దీంతో కేంద్రం ముందస్తు ఎన్నికలకు సహకరించింది. అయితే పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి కేసీఆర్ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులందరినీ తన పార్టీలోకి చేర్చుకొని కొందరికి ఆర్థిక సాయం కూడా చేశాడనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో బీజేపీ మెళ్లగా పుంజుకో సాగింది. ఇక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన ప్రతాపం చూపించడంతో కేసీఆర్ ఒక్క అడుగు వెనకకు వేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల రైతులు తలపెట్టిన బంద్ కే కేసీఆర్ అండ్ టీం పూర్తి మద్దతు తెలిపింది. అయితే కేంద్రంలో మాత్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో మోడీతో పెట్టుకుంటే మనక కూడా గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని కేసీఆర్ గ్రహించినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యవహరించిన మమతా బెనర్జీ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు. త్వరలో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టీఎంసీ నుంచి కొందరు బీజేపీ వైపు వెళ్తున్నారు.
Also Read: టీపీసీసీ రేసులో వెనుకబడ్డ రేవంత్.. కారణమెంటీ?
కేసీఆర్ కూడా మోడీతో ఫైట్ చేస్తే మమత కు జరిగిన పరాభావాలే జరిగే అవకాశం ఉంది. అందులోనూ టీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మోడీతో సత్సంబంధాలుంటేనే బెటరని ఆలోచించినట్లు సమాచారం. అందుకే బంద్ మరుసటి రోజే సెంట్రల్ విస్టాపై ప్రధానిని పొగుడుతూ కేసీఆర్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. అంతేకాకుండా ఆయనను కలిసేందుకు అపాయింట్ మెంట్ కూడా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ నాయకులకు మాత్రం ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్