https://oktelugu.com/

మావోయిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందా..?

నక్సలైటు అన్న పదం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్‌బరి అనే ఒక చిన్న గ్రామం పేరు మీదుగా వచ్చింది. తర్వాతి కాలంలో పీపుల్స్ వార్‌‌తో కలిసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)గా ఏర్పాటైంది. పీడిత ప్రజలను బానిస బతుకుల నుంచి విముక్తి చేయడం.. భూస్వాముల భూములను పేదలకు పంచాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించారు. ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీ అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు చేసింది. ఎంతో మంది అమరులయ్యారు. కానీ.. ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 2:50 pm
    Follow us on


    నక్సలైటు అన్న పదం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్‌బరి అనే ఒక చిన్న గ్రామం పేరు మీదుగా వచ్చింది. తర్వాతి కాలంలో పీపుల్స్ వార్‌‌తో కలిసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)గా ఏర్పాటైంది. పీడిత ప్రజలను బానిస బతుకుల నుంచి విముక్తి చేయడం.. భూస్వాముల భూములను పేదలకు పంచాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించారు. ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీ అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు చేసింది. ఎంతో మంది అమరులయ్యారు. కానీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ మావో సిద్ధాంతాలకు కాలం చెల్లిందా..? అనే అంశం మీదనే. ‘పీడించే బడే వాళ్లు ఉన్నంతకాలం.. పీడించే వారు ఉన్నంతకాలం మావోయిస్టుల సిద్ధాంతం ఎప్పటికీ చెక్కు చెదరదు’ అంటూ మావోయిస్టులు చెబుతున్న మాట.

    Also Read : బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

    భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జ‌న విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జ‌రిగింది. ఆ త‌రువాత పుట్టుకొచ్చిన భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థపై తిరుగుబావుటా ఎగురవేసే క్రమంలో అది నక్సల్‌బరి ఉద్యమంలా మారింది. కొన్ని ద‌శాబ్దాలుగా ఈ ఉద్యమం సాగుతూనే ఉంది. కొంత కాలంగా ఈ ఉద్యమం గాడి తప్పినట్లు కనిపిస్తోంది. పోలీసుల‌కు, ఉద్యమకారులకు మధ్య సమరంగా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యమకారులు దశాబ్దకాలంగా అర‌ణ్యాల‌కే ప‌రిమితం కావ‌డంతో ప్రజలకు వారి మధ్య దూరం పెరుగుతూనే ఉంది.

    తాజాగా మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతున్నారనే వార్తల నేపథ్యంలో మళ్లీ మావోయిజంపై చర్చ మొదలైంది. మావోయిస్టు కేంద్ర మాజీ కార్యదర్శి.. పార్టీలో కీలక నేత అయిన గణపతి త్వరలో లొంగిపోతున్నారంటూ వరుస కథనాలు రావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పీపుల్స్‌వార్‌‌ ఉద్యమం కాస్త మావోయిస్టు పార్టీగా అవ‌త‌రించ‌డంలోనూ గ‌ణ‌ప‌తి కీల‌క భూమిక పోషించారు. అంతే కాకుండా దేశ‌ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించడంలోనూ ఆయనే ప్రధానం. అలాంటి వ్యక్తి అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారంటూ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఇది కేవ‌లం పోలీసులు చేస్తున్న పుకార్లని కేంద్ర క‌మిటీ స‌భ్యుడు ఓ ప‌త్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో గ‌ణ‌ప‌తి లొంగిబాటు ఓ క‌ట్టుక‌థ అని తేలిపోయింది.

    Also Read : కేసీఆర్‌‌ ఇమేజ్‌ ముందు బీజేపీ నిలిచేనా

    ఇదే స‌మ‌యంలో మావోయిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిపోలేద‌ని, దాన్ని అమ‌లు చేయ‌డంలోనే నాయ‌క‌త్వ వైఫ‌ల్యం క‌నిపిస్తోంద‌ని ప్రజాస్వామ్యవాదులు, సామాజిక వేత్తలు అంటున్నారు. వ్యక్తుల సిద్ధాంతాల్లో మార్పులు వస్తేనే ఉద్యమం మరింత కాలం మనుగడ సాగిస్తుందని, లేదంటే కాలక్రమేనా అంత‌రించి పోతుంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.