డ్రగ్ కేసులో ఇరుక్కుంటున్న రియా చక్రవర్తి.. అరెస్టుకు రంగం సిద్ధం?

సిసీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. బాలీవుడ్లో నెపోటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలోనే సుశాంత్ సింగ్ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు సుశాంత్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ కేసులో డ్రగ్ మాఫియాకు సంబంధాలున్నట్లు తేలింది. దీంతో ఈ కేసు సస్పెన్స్ థ్రిలర్ ను తలపించేలా రోజుకో ట్వీస్ట్ తో ముందుకు […]

Written By: NARESH, Updated On : September 5, 2020 3:25 pm

riya

Follow us on


సిసీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. బాలీవుడ్లో నెపోటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలోనే సుశాంత్ సింగ్ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు సుశాంత్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ కేసులో డ్రగ్ మాఫియాకు సంబంధాలున్నట్లు తేలింది. దీంతో ఈ కేసు సస్పెన్స్ థ్రిలర్ ను తలపించేలా రోజుకో ట్వీస్ట్ తో ముందుకు సాగుతోంది.

Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ

ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ అధికారులు ఎంట్రీ అయ్యారు. డ్రగ్ సప్లయర్ బాసిత్ తో రియా చక్రవర్తికి, షోవిక్, శ్యామూల్ మిరాండాల ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. వారికి సంబంధించిన ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రియా చక్రవర్తి ఆదేశాలతోనే సుశాంత్ కు డ్రగ్ ఇచ్చినట్లు షోవిక్ విచారణ చెప్పటినట్లు తెలుస్తోంది. దీంతో రియా చక్రవర్తి డ్రగ్ కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

అదేవిధంగా గత రెండేళ్లుగా ఇక డ్రగ్స్ సప్లయర్ బాసిత్ పరిహార్‌తో తనకు సంబంధాలున్నాయని ఒప్పుకున్నాడని సమాచారం. ముంబైలోని బాంద్రా ఫుట్‌బాల్ క్లబ్‌లో తాము కలుసుకొనే వాళ్లమని.. రెండేళ్లుగా అతడితో కాంటాక్ట్ లో ఉన్నట్లు తెలిపాడట. బాసిత్ తన ఇంటికి చాలాసార్లు వచ్చాడని.. తమ కుటుంబంతో మంచి పరిచయాలు ఏర్పరుచుకున్నాడని పోలీసుల విచారణలో షోవిక్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాసిత్ ను, షోవిక్ ను అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Also Read: ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. దసరాకు సెట్స్ పైకి?

తాజాగా షోవిక్ విచారణలో వెల్లడించిన వివరాల మేరకు రియా చక్రవర్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆమె ల్యాప్ టాప్, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రియా చక్రవర్తి అరెస్టు అవడం ఖాయంగా ప్రచారం బాలీవుడ్లో జోరుగా సాగుతోంది.