
ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. జగనన్న ఇళ్లు పేరుతో ఏపీ సర్కారు ప్రచారం చేసుకుంటున్న ఇళ్లు మొత్తానికి నిధులు కేంద్రమే ఇస్తోంది. బీజేపీకి మాత్రం క్రెడిట్ దక్కడం లేదు. జగన్ సర్కారు రెండోసారి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులతో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఆ ఇళ్లు నిర్మిస్తుండగా కొత్తగా నిర్ణయం తీసుకుని శంకుస్థాపనలు చేశారని ప్రకటనలు ఇస్తున్నారు. కేంద్ర పథకం పేరు లైట్ గా ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ,అర్బన్ ప్రాంతాల్లో ఏపీకి 18 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు ఏపీ సర్కారు, రూ.1.80 లక్షలు లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం ఇచ్చేదానికంటే రూ.30 వేలు మాత్రమే అదనంగా ఇస్తుంది. కొన్ని చోట్ల ఉపాధి హామీ పథకం పనులకు అనుసంధానం చేస్తున్నారు. కేంద్రం నిధులు ఇస్తున్న బీజేపీ నేతలు మాత్రం మాట్లాడకపోవడం గమనార్హం.
ఇళ్లకు నిధులు కేంద్రం ఇస్తోంది. కానీ స్థలం మాత్రం ఏపీ సర్కారుదే. ఇప్పటికే సెంటు చొప్పున స్థలాలు ఇచ్చింది కానీ సదుపాయాల పనులు ప్రారంభం కాలేదు. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. వీటికి రాష్ర్ట ప్రభుత్వమే నిధులు చెల్లించాలి. వీటికి చేయబోయే ఖర్చు పై ఏపీ సర్కారు మాత్రం చేయడం లేదు. ఇళ్లు కట్టిస్తున్నామని చెబుతోంది. అందులో బీజేపీ వాటా ఎంతో చెప్పుకోవడం లేదు.
తెలంగాణలో అయితే బీజేపీ నేతలు కేంద్రం నిధులతో కడుతున్నారంటూ రచ్చ చేసేవారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం కేంద్రం నిధులతో జగన్ ప్రచారం చేసుకుంటున్నా నిశ్శబ్ధంగా ఉన్నారు. ఇళ్ల విషయంలో మోడీకి తగిన క్రెడిట్ దక్కేలా చేయడంకన్నా సైలెంట్ గా ఉండడమే మేలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.