Corona Third Wave: ప్రపంచ మానవాళిని ముప్పతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం రూపు మార్చుకుంటోంది. మొదటి, రెండో దశల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వైరస్ అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు టీకా రావడంతో కాస్త శాంతించినా కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. మొదటి దశలో వృద్ధులు, రెండో దశలో యువతపై ప్రభావం చూపిన వైరస్ ఇప్పుడు కొత్తగా రూపురేఖలు మార్చుకుని వేరియంట్ల రూపంలో ప్రజలను మరోమారు ఆందోళనలకు గురి చేస్తోంది.

దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఇప్పటివరకు 26 కేసులు బయట పడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. దీంతో డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వల్ల ప్రజల్లో వణుకు పుడుతోంది.
ఒమిక్రాన్ విజృంభణతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. విదేశాల నుంచి వస్తున్న వారిపై నిఘా పెంచింది. మొదట పరీక్షలు చేసిన తరువాతే వారిని దేశంలోకి రానిస్తున్నారు. దీంతో ఒమిక్రాన్ ప్రభావంతో దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు టీకాలు వేసుకుంటున్నా వైరస్ ఇలా విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Bipin Rawat: బిపిన్ రావత్ మరణంపైనా చైనా రాజకీయమేనా?
ఈ పరిస్థితుల్లో కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఒకవేళ వస్తే ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి. థర్డ్ వేవ్ వస్తే ప్రజల ఆందోళనలు తీర్చేందుకు ఏ రకమైన వ్యూహాలు తీసుకోవాలనే దానిపై సమీక్షలు జరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఆంక్షలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:General Bipin Rawat: వీర జవాన్ బిపిన్ రావత్‌కు సంబంధించిన ఈ గొప్ప విషయాలు మీకు తెలుసా?