RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. తెలుగులో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సినిమాలో తారక్ భీమ్‌గా కనిపించనుండగా.. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో దర్శనమివ్వనుననారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అన్ని భాషల్లో ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఈ క్రమంలోనే ముంబయిలో జరిగిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి హీరోలు, అలియాభట్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అలియాభట్‌ను ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు కొంటెగా సమాధానమిచ్చింది. అలియా లవర్ పేరు రణబీర్ కపూర్ నుంచి తాడాగా ఆమె నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా, హీరో, దర్శకుడు ఇలా అన్ని పేరు ఆర్ తోనే ప్రారంభం కావడంతో ఆర్ ఫ్యాక్టర్ అమెకు కలిసొచ్చిందని ఇండస్ట్రీలో టాక్. ఈ క్రమంలోనే ఓ విలేఖరి ఆర్‌ను కోడ్ చేస్తూ.. మీ జీవితంలో ‘ఆర్’ అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం ‘ఆర్’ అక్షరం చాలా ట్రెండింగ్‌లో ఉంది. మీ లైఫ్‌కి ‘ఆర్’ లక్కీ ఫ్యాక్టర్ అనుకోవచ్చా’ అని అలియాభట్‌ను అడిగారు.
దానికి అలియా తెలివిగా సిగ్గుపడుతూ.. దీనికి నా దగ్గర సమాధానం లేదని చెప్పింది. కరెక్ట్ సమాధానం చెప్పాలంటే మరింత తెలివిగా వ్యవహరించాలని పేర్కొంది. అవును నిజానికి ఆర్ నారు లవ్లీ అల్ఫాబెట్ అని చెప్పుకోవచ్చని వివరించింది. మరోవైపు రాజమౌళితో కలిసి పని చేయడం చాలా త్రిల్లింగ్‌గా అనిపించిందని పేర్కొంది అలియా. ఇలా మరెన్నో ముచ్చట్లు చెప్పుకొచ్చింది.