Jamili Elections: జమిలీ ఎన్నికల నినాదం మరోమారు తెరమీదకు వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట జమిలీ ఎన్నికల మాట నినాదంగా మారుతోంది. ఒకే సారి జంట ఎన్నికలు జరపడంతో ఖర్చు కలిసొస్తుందనే వాదం వినిపిస్తోంది. దీంతో ప్రధాని సైతం జంట ఎన్నికలపై తన మనుసులోని మాట బయటపెట్టారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనే విధానంతోనే దేశానికి లాభం అనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జంట ఎన్నికల నినాదం అందరిలో చర్చనీయాంశం అవుతోంది.
జమిలీ ఎన్నికలకు కేంద్రం మొగ్గు చూపుతోందా?
జమిలీ ఎన్నికలపై ఇప్పటికే కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఆచరణ సాధ్యం కావడం లేదు. మనదేశంలో ఒక మంచి పని చేయాలంటే దానికి ఎంత కష్టం ఉంటుందో తెలిసిందే కదా. దీనికి కూడా అడ్డంకులు పడుతూనే ఉన్నాయి. దీంతో జంట ఎన్నికల నినాదం కేవలం వాగ్దానంగానే మిగులుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో జంట ఎన్నికలను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
Also Read: కొత్త జిల్లాలతో ఇక కొత్త వారికి మంత్రి పదవులు
అందుకనుగుణంగా అడుగులు వేస్తోంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కూడా జంట ఎన్నికలపై పేచీ పెట్టడం లేదు. దీంతో లా కమిషన్ సిఫార్సులు కూడా చేసింది. ఈ నేపథ్యంలో జంట ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంతి కేంద్రం పరిధిలోనే ఉంది. లోక్ సభ, రాజ్యసభల్లో బీజేపీకి కావాల్సినంత బలం కూడా ఉంది. దీంతో రాబోయే ఎన్నికల్లో జమిలీ ఎన్నికల ఆచరణ కొలిక్కి రావడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు జమిలీ ఎన్నికలపై సవాళ్లు కూడా ఎదురవుతాయి. దీంతో కేంద్రం మరోమారు ఆలోచిస్తోంది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఏర్పడే సమస్యల గురించి ఆరా తీస్తోంది. ఏది ఏమైనా మరో కొద్ది రోజుల్లో జమిలీ ఎన్నికల నిర్వహణ ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జమిలీ ఎన్నికలకు ఈసీ సైతం సిద్ధంగానే ఉన్నట్లు గతంలోనే ప్రకటించడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జమిలీ ఎన్నికల నినాదం వాగ్దానంగానే ఉండిపోతోందా? లేక ఆచరణ సాధ్యమై ఓటర్ల కోరిక తీరుస్తుందా అనేది తేలాల్సి ఉంది.
Also Read: ఎన్నికలకు పక్కా వ్యూహం.. జిల్లాలకు కొత్త బాసులు.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్..