Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా పేరు ‘కొండా’. తెలంగాణ రాజకీయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కొండా దంపతుల నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఈ ‘కొండా’ సినిమాను తీసుకురాబోతున్నాడు. మొన్నటివరకు తన విచిత్రమైన చిత్రాలతో విసిగించిన వర్మ తాజాగా ఈ ‘కొండా’ సినిమాతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు.
ఇక మొన్న వాయిస్ ఓవర్ తో ఓ ఝలక్ చూపించిన వర్మ, నేడు ట్రైలర్ వదిలాడు. ఆశ్చర్యకరంగా, మొదటి షాట్ నుండే తన మార్కును చూపెట్టాడు. శవాలు చెట్టుకు వేలాడడం, ఓ బాలికను కర్రకు కట్టి తీసుకెళ్లడం, హీరోయిన్ ని స్కూటర్ నడుపుతూ చూపించడం వంటి షాట్స్ తో మునుపటి పదును చూపించాడు. మొత్తమ్మీద కొండా ట్రైలర్ తో రాంగోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అనిపించాడు.
Also Read: జమిలీ ఎన్నికలకు కేంద్రం మొగ్గు చూపుతోందా?
కాగా 1980వ సంవత్సరం జరిగిన ఘటన ఆధారంగా కొండా సురేఖ, మురళి ప్రేమ కథకు కాస్త మసాలా యాడ్ చేసి ఈ సినిమాను చేస్తున్నాను అంటూ వర్మ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొండా మురళికి నక్సలైట్ ఆర్కే తో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి కూడా సినిమాలో ప్రత్యేకమైన సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.
Also Read: AP New Disticts: కొత్త జిల్లాలతో ఇక కొత్త వారికి మంత్రి పదవులు
మెయిన్ గా సినిమా బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. ఈ సినిమాలో అప్పటి కాలంలో జరిగిన అనేక అంశాలను కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా చూపించ బోతున్నారట. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మొత్తమ్మీద కొండా మురళి క్యారెక్టర్ ను సినిమాలో చాలా సీరియస్ గా చాలా హీరోయిజమ్ గా చూపిస్తున్నారట.