AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఉద్యోగుల కేటాయింపు తదితర కార్యక్రమాల కోసం జీవోలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. ఉగాది నుంచే కొత్త జిల్లాలు పనులు ప్రారంభించాయి. ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల్లో పనులు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదివరకు 51 ఉన్న రెవెన్యూ డివిజన్లు 73కు పెరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. వసతుల కల్పనకు పనులు చేపడుతున్నారు. కొత్త భవనాల ద్వారా పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ద్వారా పనులు నిర్వహంచనుంది.
Also Read: Pawan Kalyan Farmers: అధికార పార్టీకి మైండ్ బ్లాక్.. రైతులకు అండగా జనసేనాని
ఇప్పటికే వచ్చిన వ్యతిరేకతను ప్రభుత్వం లెక్కచేయడం లేదు. చాలా చోట్ల జిల్లా కేంద్రాలు మార్చాలని రెవెన్యూ డివిజన్లలో కూడా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లు నెరవేర్చకుండా ఒంటెత్తు పోకడతో వ్యవహరించిందని తెలుస్తోంది. అయినా ప్రజల డిమాండ్లు పట్టించుకోకుండా పనులు చేసేందుకు ముందుకు నడుస్తోంది. పాత డివిజన్లతో పాటు కొత్త డివిజన్ల పనులు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన వేగవంతం కానుందని చెబుతున్నారు.
దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చాలా ప్రాంతాల్లో వైసీపీ నేతలే రోడ్ల మీదకు వచ్చినా నిర్లక్ష్యం చేశారు. దీంతో రాబోయే ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల, రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో ప్రభుత్వం ఏ మేరకు సరైన నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. ఈ క్రమంలో కొత్త జిల్లాల, రెవెన్యూ డివిజన్ల పనులు షురూ కానున్నట్లు చెబుతున్నారు.
Also Read:AP Cabinet Expansion: ఎన్నికల టీమ్ రెడీ.. పూర్తయిన జగన్ కేబినెట్ కూర్పు