Shocking Story: పెళ్లి తరువాత జరిగే తంతు కోసం అందరు ఉత్సాహపడుతుంటారు. తానేమిటో నిరూపించుకోవాలని కలలు కంటుంటారు. శోభనం అంటే అందరికి ఓ అద్భుతమైన ఘట్టమే. దాని కోసమే జీవితాంతం ఎదురుచూస్తుంటారు. ఆ సమయం రాగానే తమలోని ఆనందాన్ని రెట్టింపు చేసుకుని జీవితంలో మధురమైన రాత్రులను గడుపుతుంటారు. ఇక్కడ మాత్రం అతడి కలలు కల్లలే అయ్యాయి. అతడు ఊహించిందేమీ జరగలేదు. మొదటి రాత్రే భార్య భర్తను దూరం పెట్టింది. దీంతో ఆమెకు భయం ఉందేమో అనుకుని భార్యను అర్థం చేసుకుని భర్త ఆమెకు సహకరించాడు. శోభనం వాయిదా వేసుకుని ఆమె అంగీకారం కోసం రోజుల తరబడి వేయి కళ్లతో వెతకసాగాడు.
పది రోజుల తరువాత ఆమె అన్ని సర్దుకుని వెళ్లిపోయింది. దీంతో ఊహించని షాక్ కు గురయ్యాడు. కల్ చేస్తే మధ్యప్రదేశ్ టిక్మాగడ్ జిల్లాకు చెందిన రంజిత్ సింగ్ పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అతడికి పెళ్లిళ్ల పేరయ్య పరిచయమయ్యాడు. పేరయ్య తన చెల్లికి పెళ్లిచేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇక ఆలస్యమెందుకు ఆమెను పెళ్లి చేసుకోవాలని రంజిత్ అనుకున్నాడు. అభ్యంతరాలు లేకపోవడంతో ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లి తంతు పూర్తి చేశారు. రంజిత్ కల నెరవేరింది.
Also Read: AP New Districts: కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రక్రియ ప్రారంభమేనా?
మూడు ముళ్లతో ఓ ఇంటివాడయ్యాడు. మార్చి 20న పెళ్లి చేశారు. రంజిత్ పెళ్లి ఖర్చుల కింద మధ్యవర్తికి రూ. 1.50 లక్షలు ముట్టజెప్పాడు. దీంతో రంజిత్ శోభనం గురించి ఎన్నో కలలు కన్నాడు. కానీ అతడి కలలన్నీ కల్లలే అయ్యాయి. ఫస్ట్ నైట్ మాత్రం జరగలేదు. దీంతో భార్య సిగ్గుపడుతుందేమోనని ఎదురు చూశాడు. ఆమెలో మాత్రం మార్పు కనబడలేదు. పది రోజులు గడిచినా ఎవరికి చెప్పకుండా ఉండిపోయాడు. ఆ మరునాడు ఆమె కనబడలేదు.
ఇంట్లో దాచిని రూ.60 వేలతోపాటు నగదు, నట్రా, డబ్బు అన్ని దోచుకుని వెళ్లిపోయింది. రంజిత్ దిమ్మతిరిగిపోయింది. తన పుట్టింటి వారు బేతుల్ జిల్లాలో ఉంటారని చెప్పడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా దొంగ పెళ్లిళ్ల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానాస్తున్నారు. వారి ఆచూకీ మాత్రం లభించలేదు. సొత్తు మాత్రం తస్కరించబడింది. రంజిత్ ఆశలు అడియాశలే అయ్యాయి. ఎన్నో ఊహలతో శోభనం గురించి శ్రద్ధ చూపినా చివరకు బోల్తా కొట్టించింది. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు.
Also Read:Komaram Bheemudu Song: ‘కొమురం భీముడో’ పాటలోని పదాలకు అర్థాలు, వాటి మూలాలు ఏమిటి?