https://oktelugu.com/

విజయసాయి అందుకే పార్లమెంట్‌ సమావేశాల నుంచి వచ్చేశారా..?

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు.. చర్చలకు అటెండ్‌ అయ్యేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ ముందుంటాడు. అలాంటిది రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. తన పేరు పిలిచే సమయానికి ఆయన వెళ్లిపోయారు. సాగు చట్టాల విషయంలో లోక్‌సభ పెద్దగా జరగడం లేదు. అప్పుడప్పుడూ కొంత మంది మాట్లాడుతున్నారు కానీ.. అందులో వైసీపీ ఎంపీలెవరూ ఉండటం లేదు. సాగు చట్టాలపై మారథాన్ చర్చ జరపాలని రాజ్యసభ చైర్మన్ నిర్ణయించారు. అందులో వైసీపీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 5, 2021 / 01:44 PM IST
    Follow us on


    పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు.. చర్చలకు అటెండ్‌ అయ్యేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ ముందుంటాడు. అలాంటిది రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. తన పేరు పిలిచే సమయానికి ఆయన వెళ్లిపోయారు. సాగు చట్టాల విషయంలో లోక్‌సభ పెద్దగా జరగడం లేదు. అప్పుడప్పుడూ కొంత మంది మాట్లాడుతున్నారు కానీ.. అందులో వైసీపీ ఎంపీలెవరూ ఉండటం లేదు. సాగు చట్టాలపై మారథాన్ చర్చ జరపాలని రాజ్యసభ చైర్మన్ నిర్ణయించారు. అందులో వైసీపీ పాల్గొనడం కూడా కష్టమే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

    Also Read: స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం ఒక్క వారిదేనా..? : అందరిది కాదా!

    ఎందుకంటే.. విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాలను లైట్‌ తీసుకొని ఇప్పటికే విశాఖకు చేరిపోయారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి చెప్పినట్లుగానే మిగితా ఎంపీలు నడుచుకోవాలి. ఆయన ఇప్పుడు విశాఖలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగియగానే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టేస్తారని ఆయన గట్టి నిర్ణయానికి వచ్చారు. నిమ్మగడ్డ పదవీ విరమణ చేయగానే ఎన్నికలు వస్తాయని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడే వచ్చేస్తున్నాయి కాబట్టి పార్టీ నేతలను ప్రిపేర్ చేయడానికి విశాఖలో మకాం వేశారు. ఎలాంటి నివేదికలొచ్చాయో కానీ.. పార్లమెంట్ సమావేశాలు వదిలి విశాఖకు చేరిపోయారు. మేయర్ పీఠం గెలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

    అయితే.. విజయసాయిరెడ్డికి పార్లమెంట్ సమావేశాల కన్నా.. విశాఖలో పార్టీ నేతలతో భేటీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్లమెంట్‌లో మాట్లాడాల్సి వస్తే.. కేంద్రానికి అనుకూలంగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ పార్లమెంట్ బయట మాత్రం.. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బడ్జెట్‌ను ఖండించారు. లోపల మాట్లాడితే అధికారికంగా రికార్డు అవుతుంది. అలా చేస్తే ఇంకా సమస్యలు వస్తాయి. అందుకే.. విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా విశాఖలో రాజకీయం చేసుకోవడానికి సమయం కేటాయించేస్తున్నారు.

    Also Read: ఎన్నికల ‘పంచాయితీ’లో ప్రభుత్వ వాదన కరక్టేనా!

    ఎంతైనా రాజకీయం చేయడంలో విజయసాయిరెడ్డి తరువాతే ఎవరైనా అన్నట్లుగా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రి చట్టాలకు పార్లమెంట్‌ వేదికగా అయితే సపోర్టు చేయాల్సి ఉంటుంది. కనుక అటు చట్టాలకు సపోర్టు చేయలేక.. ఇటు విమర్శించలేక బయటికి వచ్చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్