https://oktelugu.com/

జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నాంపల్లి కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. 2014 నాటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సమన్లు ఇవి. ఇందులో జగన్‌ ఎ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో భాగంగా ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఈ సమన్లు ఏడేళ్ల కిందటి కేసుకు సంబంధించినవి. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానానికి విజ్ఙప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత హాజరు నుంచి […]

Written By: , Updated On : February 5, 2021 / 01:53 PM IST
Follow us on

CM Jagan
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నాంపల్లి కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. 2014 నాటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సమన్లు ఇవి. ఇందులో జగన్‌ ఎ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో భాగంగా ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఈ సమన్లు ఏడేళ్ల కిందటి కేసుకు సంబంధించినవి. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానానికి విజ్ఙప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలా? లేదా? అనేది ఈ కేసు తీవ్రత ఆధారంగా న్యాయస్థానం తీసుకోవచ్చని చెబుతున్నారు.

Also Read: స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం ఒక్క వారిదేనా..? : అందరిది కాదా!

2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్.. 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రచారాన్ని నిర్వహించారంటూ ఆయనపై కేసు నమోదైంది. అప్పట్లో కోదాడ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. జాతీయ రహదారి మీద ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం ఎన్నికల రూల్స్‌కు విరుద్ధమని… నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చార్జిషీట్‌‌ను దాఖలు చేశారు. ఈ కేసులో జగన్‌‌ను ఎ1 చేర్చారు.

Also Read: విజయసాయి అందుకే పార్లమెంట్‌ సమావేశాల నుంచి వచ్చేశారా..?

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో మిగిలిన ఎ2, ఎ3గా ఉన్న వారిపై కేసులను న్యాయస్థానం కొట్టేసింది. వారు వ్యక్తిగతంగా న్యాయస్థానానికి హాజరు కావడం, వివరణ ఇవ్వడంతో కేసును కట్టేసింది. తాజాగా ఇదే కేసులో ఎ1 ఉన్న వైఎస్ జగన్‌ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఫలితంగా నాంపల్లి న్యాయస్థానం సమన్లను జారీ చేసింది. ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరేలా ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తారని అంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్