https://oktelugu.com/

AP 3 Capitals : జగన్ మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుందని అందుకేనట?

AP 3 Capitals : ఏపీకి మూడు రాజధానుల బిల్లు రద్దుపై సీఎం జగన్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి బిల్లును వెనక్కి తీసుకుంటూనే పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని ప్రత్యర్థుల ఆనందాన్ని నీరుగారుస్తూ గట్టి షాకిచ్చారు జగన్.ప్రస్తుతానికి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూనే పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులపై మళ్లీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2021 / 08:15 PM IST
    Follow us on

    AP 3 Capitals : ఏపీకి మూడు రాజధానుల బిల్లు రద్దుపై సీఎం జగన్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి బిల్లును వెనక్కి తీసుకుంటూనే పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని ప్రత్యర్థుల ఆనందాన్ని నీరుగారుస్తూ గట్టి షాకిచ్చారు జగన్.ప్రస్తుతానికి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూనే పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    somu-ys-jagan

    somu-ys-jagan

    ఏపీకి మూడు రాజధానులపై మళ్లీ కొత్త బిల్లుతో ముందుకొస్తున్నారు. అంతేకానీ మూడు రాజధానులపై జగన్ వెనక్కి తగ్లేదు. విశాఖను రాజధాని చేయడానికి కాదు.. అవే మూడు రాజధానులు కానీ.. కాస్త గ్యాప్ ఇచ్చి సమగ్రంగా ఏర్పాటు చేస్తారన్న మాట.. దీన్ని బట్టి జగన్ కర్ర విరగకుండా పామును చంపేలా తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరించారని చెప్పొచ్చు

    అయితే జగన్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. 3 రాజధానులకు సంబంధించి కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే బిల్లులను జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని సోమువీర్రాజు అన్నారు. అధికార వికేంద్రీకరణ వారి సొత్తు కాదన్నారు. రోడ్డులో గోతులు పూడ్చలేని వారు వికేంద్రీకరణ అంటున్నారని ఎద్దేవా చేశారు.

    అమరావతిలోనే రాజధాని ఉంటుందని గతంలో చెప్పిన మాటకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. రాజధానులపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజా అభిప్రాయం సేకరించాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

    మొత్తానికి జగన్ మూడు రాజధానుల రద్దు వెనుక ఉన్న గుట్టును విప్పారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేవలం కోర్టుల్లో కొట్టుడుపోయి అభాసుపాలు కాకూడదనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని కుండబద్దలు కొట్టారు. మరి దీనిపై వైసీపీ బ్యాచ్ ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.