Site icon OkTelugu

Marakkar: తెలుగులో మరక్కార్ విడుదలయ్యేది అప్పుడే

Marakkar

Marakkar: మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందారు మనమంతా,జనతా గ్యారేజ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.మళయాలంలో తెరకెక్కిన “మరక్కార్”మంచి రెస్పాన్స్ అందుకుంటుంది త్వరలో తెలుగు ప్రేక్షక అభిమానాలు అలరించేందుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన కనులను కలిపినా అంటూ వచ్చిన మొదటి పాటకు మంచి స్పందన లభించింది.

ఈ చిత్రం అరేబియా సముద్ర సింహ అనేది ఉప శీర్షిక ఈ డిసెంబర్ 2న తెలుగులో విడుదల కానుంది. ప్రియదర్శన తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ మళయాంలో భారీ ఎత్తున నిర్మించాన ఈ సినిమా మంచి విజయం అందుకుంటుంది ఈ సినిమా. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌ మీద ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ఈ సినిమాను కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మరక్కార్ తెలుగు హక్కులను సురేష్ ప్రొడక్షన్ దక్కించుకుంది. తెలుగులో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.మరక్కార్ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రయదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. రొన్నీ రాఫెల్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఆయన హీరోగా వచ్చిన మన్యం పులి సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Exit mobile version