Shekhar movie: ‘శేఖర్’ ఫస్ట్ గ్లింప్స్ డేట్ ఖరారు

sekhar movie: సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన కథను ఎంచుకొని బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ కింగ్ గా మారారు ఈ సీనియర్ నటుడు రాజశేఖర్. ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు కల్కి సినిమా విజయం తర్వాత ఇప్పటివరకు తన ఖాతాలో హిట్ సినిమా లేదనే చెప్పాలి. మరో వైవిధ్యమైన కథతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నారు రాజశేఖర్. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]

Written By: Raghava Rao Gara, Updated On : November 22, 2021 8:12 pm
Follow us on

sekhar movie: సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన కథను ఎంచుకొని బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ కింగ్ గా మారారు ఈ సీనియర్ నటుడు రాజశేఖర్. ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు కల్కి సినిమా విజయం తర్వాత ఇప్పటివరకు తన ఖాతాలో హిట్ సినిమా లేదనే చెప్పాలి. మరో వైవిధ్యమైన కథతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నారు రాజశేఖర్.

జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “శేఖర్”. ఈ మూవీని సుధాకర్ ఇంపెక్స్ ఐపియల్, త్రిపురా క్రియేషన్స్, పెగాసెస్, టారాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటి లో ఈ చిత్రాన్ని లలిత్ అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్నారని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జీవిత దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ సినిమా నుండి తాజా పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.పోస్టర్ లో బుల్లెట్ మీద రాజశేఖర్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ఉంటారు. ఈ నెల 25న ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు ఇది రాజశేఖర్ కు 91వ చిత్రం అవడం విశేషం.

“శేఖర్” చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన “జోసెఫ్” సినిమాకి తెలుగులో రీమేక్ అవుతోంది.ఓ ఇంటెలిజెంట్ రిటైర్డ్ పోలీసాఫీసర్ .. నగరంలో సంచలనం స‌ృష్టిస్తున్న ఓ క్రిమినల్ కేసు ను టేకప్ చేస్తాడు. ఈ క్రమంలో అతడు కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు.అయితే ఆ కేసును చివరికి అతడు ఎలా సాల్వ్ చేస్తారు అనే అంశం మీద ఉత్కంఠగా సాగుతుంది ఈ కథ. రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రలో ‘శేఖర్’సినిమా లో రాజశేఖర్ నటిస్తున్నారు.