DGP CMO Secretary: 24 గంటల్లోనే ఇద్దరిని లేపిన జగన్..డీజీపీ, సీఎంవో కార్యదర్శి బదిలీలకు అసలు కారణం అదే?

DGP CMO Secretary:  పీఆర్సీపై ఏపీలో ఉద్యోగులు చేసిన ఆందోళన చివరకు ఉన్నతాధికారుల సీటుకు ఎసరు తెచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనను కట్టడి చేయడంలో ఇద్దరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకున్నట్టు భోగట్టా.. వారిలో ఒకరు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కాగా.. మరొకరు సీఎంవో కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ . అయితే వీరు మొదటి నుంచి ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తున్నా.. అనూహ్యంగా వీరిని బదిలీ చేయడం చర్చనీయాంశమయ్యాయి. […]

Written By: NARESH, Updated On : February 16, 2022 12:07 pm
Follow us on

DGP CMO Secretary:  పీఆర్సీపై ఏపీలో ఉద్యోగులు చేసిన ఆందోళన చివరకు ఉన్నతాధికారుల సీటుకు ఎసరు తెచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనను కట్టడి చేయడంలో ఇద్దరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకున్నట్టు భోగట్టా.. వారిలో ఒకరు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కాగా.. మరొకరు సీఎంవో కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ . అయితే వీరు మొదటి నుంచి ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తున్నా.. అనూహ్యంగా వీరిని బదిలీ చేయడం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలు స్పందించాయి. ఈ బదిలీలపై టీడీపీ నాయకులు మాట్లాడుతూ జగన్ ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నాడని, ఇందులో భాగంగానే వారి స్థానాలను మార్చారన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ డీజీపీని మార్చి మిగతా పోలీసులకు హెచ్చరికలు పంపారా..? అని విమర్శించారు.

DGP CMO Secretary

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. తాము అనుకున్నవిధంగా ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించలేదని కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విజయవాడకు వెళ్లే ఉద్యోగులను కట్టడి చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఆందోళనలో పాల్గొనే వాళ్లు మారువేషాల్లో వచ్చి విజయవాడ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Also Read: అశోకవనంలో విశ్వక్‌ సేన్ కొత్త సాంగ్ అదిరింది

‘చలో విజయవాడ’ సక్సెస్ కావడానికి పోలీసులు కూడా సహకరించారన్న వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఫిట్మెంట్ పై వారు కూడా అసంతృప్తితో ఉన్నారని, అందుకే ‘చలో విజయవాడ’కు సహకరించారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఇదిలా ఉండగా ఉద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం దిగి వచ్చింది. అంతేకాకుండా హెచ్ ఆర్ ఏ పెంచుతూ నిర్ణయం తీసుకొని వారి ఆందోళనను విరమింపజేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడింది. ఈ వ్యవహారానికి డీజీపీయే కారణమని, ఉద్యోగుల ఆందోళనను కట్టడి చేయడంలో విఫలమయ్యారని భావిస్తూ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసిందని అంటున్నారు. అటు అర్ధరాత్రి జీవీలు విడుదల చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎంవో కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేశారు.

అయితే వీరి బదిలీలపై రాజకీయ పార్టీలు స్పందించాయి. ఈ బదిలీల వెనుక ఏదో కారణం దాగి ఉందని టీడీపీ ఆరోపించింది. వీరిద్దరు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నా.. బదిలీ చేయడం ఎందుకని ప్రశ్నించింది. ఈ మేరకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను కూడా ఇలాగే బదిలీ చేశారని అన్నారు. ఇప్పటికైనా ఐఏఎస్, ఐపీఎస్ లు తమ విధులను గుర్తించి బాధ్యత వహించాలని సూచించారు. అధికారులను జగన్ కరివేపాకులా వాడుకొని వదిలేస్తారని, ఆ విషయాన్ని అధికారులు గుర్తించాలని కోరారు.

అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ బదిలీపై స్పందించారు. రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. ‘చలో విజయవాడ’ సక్సెస్ అయినందునే డీజీపీని మార్చారని ఆరోపించారు. డీజీపీని బదిలీ చేసి చిరు ఉద్యోగులకు హెచ్చరిక పంపారని అంటున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను కూడా ఆకస్మికంగా బదిలీ చేయడంపై ప్రభుత్వాన్ని విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో బదిలీపై చర్చలు జరుగుతున్నాయి. పీఆర్సీపై ఉద్యోగులు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ టీచర్లు మాత్రం ఆందోళన చేపడుతామని అంటున్నారు. త్వరలో మరో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు డీజీపీ మార్పుతో వారి కార్యక్రమాన్ని అడ్డుకట్ట వేయనున్నారా..? అని చర్చించుకుంటున్నారు.

Also Read: నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు