Devotional Tips: సాధారణంగా ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే కొందరికి వారికిష్టమైన దేవుడి చిత్రపటాన్ని చూడటం లేదా వారికి ప్రియమైన వారిని చూడటం లేదా మరి కొందరు వారి అరిచేతులను చూస్తూ నిద్రలేవడం చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఆ రోజు మొత్తం మనకు ఎంతో చిరాకుగా గడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఈ రోజు ఉదయం ఎవరి మొహం చూశానో ఏమో కానీ ఇలా జరుగుతుందని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. అయితే పురాణాల ప్రకారం పెద్దలు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచే ముందు ఎలాంటి వస్తువులను చూడాలి, ఏ వస్తువులను చూడకూడదు అనే విషయాలను ఎంత చక్కగా వివరించారు మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
ఉదయం నిద్ర లేవగానే చూడకూడనివి..
ప్రతిరోజు ఉదయం మగవారు నిద్రలేచే ముందు వారి భార్య జుట్టు విరబోసుకుని ఉండటం చూడకూడదు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అమ్మాయిలు నుదుటిన బొట్టు పెట్టుకోవడం ఆచారం. అయితే ఉదయం నిద్రలేవగానే నుదుటిపై బొట్టు లేని మహిళను చూడకూడదు. అదేవిధంగా చాలామందికి నిద్రలేవగానే సరాసరి వంట గదికి వెళ్లి వంట పనులు ప్రారంభిస్తారు. అయితే వంటగదిలో పాచి పాత్రలను అసలు చూడకూడదు. ఇక ప్రతి ఒక్కరు ఇంటిలో ఎన్నో రకాల జంతువుల ఫోటో ప్రేమ్స్ పెట్టుకొని ఉంటారు. ఈ క్రమంలోనే సింహం, పులి వంటి క్రూరమైన జంతువులను ఉదయం నిద్రలేవగానే చూడకూడదు.కళ్లు లేని వారిని అలాగే భర్త చనిపోయిన మహిళలు కూడా ఉదయం నిద్రలేవగానే చూడకూడదని పెద్దలు చెబుతుంటారు.
Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
నిద్ర లేవగానే చుడాల్సినవి…
మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా భూదేవికి నమస్కరించిన అనంతరమే కింద కాళ్లు పెట్టాలి. మనం చేసే పాపాలన్నింటినీ ఎంతో సహనంతో భరించేది భూమాత కనుక ఆమెకు ముందుగా వందనాలు చేసుకోవాలి. అదేవిధంగా ఉదయం నిద్రలేవగానే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడటం ఎంతో మంచిది. అదేవిధంగా గోమాతను లేదా తులసి మొక్కను ఉదయం నిద్ర లేవగానే చూడటం శుభానికి సంకేతం. తులసి మొక్క గోమాతను సకల దేవతలు కొలువై ఉంటారు కనుక ఉదయమే నిద్ర లేవగానే వీటిని చూడటం ఎంతో మంచిది.ఇక గుడి గోపురం పర్వతాలు సముద్రం వంటి వాటిని కూడా ఉదయం నిద్ర లేవగానే చూడటం శుభ సంకేతం. ఇక అగ్ని చూసిన దీపాన్ని చూసిన యజ్ఞం చేసే వారిని చూసిన మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అగ్నిమంగళకరమైనదిగా భావిస్తారు అలాగే ఉదయం నిద్రలేవగానే మన అరచేతులను చూసుకోవడం కూడా ఎంతో మంచిది. నిద్ర లేవగానే ఈ వస్తువులను చూడడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది.
Also Read:
సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించాడా? ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో వాళ్లు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?
24 గంటల్లోనే ఇద్దరిని లేపిన జగన్..డీజీపీ, సీఎంవో కార్యదర్శి బదిలీలకు అసలు కారణం అదే?
పవన్ కళ్యాణ్.. అమావాస్య చంద్రుడేనా?
షర్మిల అరెస్టుతో ఏం జరుగుతోంది?