https://oktelugu.com/

ఇందిరాగాంధీ అంత్యక్రియలు: రాజీవ్, రాహుల్ ఫొటో వైరల్ వెనుక కథ..

సోషల్ మీడియా వచ్చాక ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదు. బలమైన ఈ సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ మద్దతుదారులు చెలరేగిపోతున్నారంటే నమ్మండి. వారు కాంగ్రెస్ ను, ఆ పార్టీ నేతల బట్టలిప్పి నడిబజారులో నిలబెట్టాలే కథనాలు, అభూత కల్పనలతో పోస్టులు పెడితూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ వాదులు వాపోతున్నారు. తాజాగా రాహుల్, రాజీవ్ గాంధీలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు కలకలం రేపుతోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 15, 2022 10:35 pm
    Follow us on

    సోషల్ మీడియా వచ్చాక ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదు. బలమైన ఈ సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ మద్దతుదారులు చెలరేగిపోతున్నారంటే నమ్మండి. వారు కాంగ్రెస్ ను, ఆ పార్టీ నేతల బట్టలిప్పి నడిబజారులో నిలబెట్టాలే కథనాలు, అభూత కల్పనలతో పోస్టులు పెడితూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ వాదులు వాపోతున్నారు. తాజాగా రాహుల్, రాజీవ్ గాంధీలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు కలకలం రేపుతోంది. అక్టోబర్ 31న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి. మాజీ ప్రధానికి నివాళులర్పిస్తూ సాధారణ సందేశాలతో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో కూడిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ తాజాగా వైరల్ అవుతోంది. ఇది కాంగ్రెస్ పరువు తీసేలా ఉంది.అయితే ఆ ఫొటో వెనుక పెద్ద కథనే ఉంది.

    ఇందిరా గాంధీ మృతదేహం ముందు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ప్రార్థనలు చేస్తున్న పాత ఫొటో అది. అందులో వీరిద్దరూ ఇందిరాగాంధీ మృతదేహం వద్ద కల్మా (ఇస్లామిక్ ప్రార్థనలు) చదువుతున్నారని  పోస్ట్ లో పేర్కొని విమర్శించారు. పక్కనేఉన్న పీవీ నరసింహరావు రెండు చేతులతో నమస్కరిస్తుంటే రాహుల్, రాజీవ్ ఇలా ముస్లిం సంప్రదాయంలో మొక్కడాన్ని ఆ పోస్టులో తీవ్రంగా విమవర్శించారు.

    ఫోటోలో ఇద్దరు మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, నరసింహారావు ఉన్నారు. ఈ చిత్రంలో రాహుల్ గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా కనిపిస్తారు. రాహుల్, రాజీవ్ గాంధీలను నెటిజన్లు ఈ ఫొటో షేర్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు..

    హిందీలో రాసిన పోస్ట్‌ ను చూస్తే.. ‘ఇందిరాగాంధీ మృతదేహం ముందు, రాహుల్ మరియు రాజీవ్ గాంధీ కల్మాను చదువుతున్నారు, అయితే మన దేశ ప్రజలకు వీళ్లు బ్రాహ్మణులని అనుకుంటున్నారు.’ అంటూ వీరిని అవమానించేలా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.

    దీనిపై అసలు విషయాన్ని ఆరాతీయగా.. ఇది తప్పుడు ఫొటో అని తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ఫొటోగా గుర్తించారు. ఈ ఫొటో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అంత్యక్రియలకు సంబంధించినది కాదు. ఫ్రాంటియర్ గాంధీ లేదా బచా ఖాన్ అని పిలువబడే ఆఫ్ఘన్ నాయకుడు.. స్వాతంత్ర్య సమరయోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంత్యక్రియలకు సంబంధించినది.

    ఈ వైరల్ పోస్ట్ ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో కనిపించింది. ఫాక్ట్ చెకర్ బూమ్ లైవ్ ఇది రాహుల్, రాజీవ్ లను అవమానించేలా కావాలని కొందరు నెటిజన్లు సృష్టించారని తేలడంతో తొలగించింది.

    ఈ వైరల్ ఇమేజ్ ఉత్తర వజీరిస్థాన్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడు మొహ్సిన్ దావర్ ట్వీట్‌ చేయడంతో తాజాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటోల్లో రెండు చోట్లా ఇది బచాఖాన్ అంత్యక్రియల చిత్రం అని ప్రస్తావించబడింది, ఇక్కడ గాంధీ గేమిలీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

    ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, జనవరి 20, 1988న పేశ్వర్ లో మరణించారు. రాజీవ్ గాంధీ అతని కుటుంబం మరియు ఇతర నాయకులతో కలిసి పాకిస్థాన్‌లో జరిగిన ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. ఎల్ఏ టైమ్స్ మరియు యునైటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ వంటి అనేక అంతర్జాతీయ వార్తాపత్రికలలో ఇది ప్రచురితమైంది.

    ఇందిరా గాంధీ అక్టోబర్ 31, 1984 న మరణించారు. ఆమె అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. కాబట్టి ఇందిరా గాంధీ మృతదేహం ముందు గాంధీ కుటుంబం ఇస్లామిక్ ఆచారాలను అనుసరించిందని పేర్కొంటూ వైరల్ పోస్ట్ తప్పుడు పోస్టుగా తేలింది. రాజీవ్ గాంధీ మరియు రాహుల్ గాంధీని అవమానించేలా వైరల్ అవుతున్న ఈ ఫొటో ఇందిరా గాంధీ అంత్యక్రియలకు సంబంధించినది కాదని తేటతెల్లమైంది.