Telangana Budget: తెలంగాణలో టీఆర్ఎస్ బలోపేతం కావడంతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఆలోచించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి వరుసగా రెండోసారి బంపర్ విక్టరీని సాధించారు.
ఇక ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారంలో రావడంతోపాటు జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొంతకాలంగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, దళితబంధు వంటి పథకాలను జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యేలా పదేపదే మాట్లాడుతున్నారు.
Also Read: 50 రోజుల్లో 350 కోట్లు.. పుష్పరాజ్ రేంజ్ ఇది !
హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెరపైకి తీసుకొచ్చిన దళితబంధును వచ్చే ఎన్నికల్లో తురుపుముక్కగా వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి బడ్జెట్లో 20శాతం కేటాయింపులు ఈ ఒక్క పథకానికి ఉంటాయనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. మార్చి నాటికి ప్రతీ నియోజకవర్గంలో వంద మంది ఎస్సీలకు దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఆ దిశగా రాష్ట్రంలో ఎక్కడా అడుగులు పడకపోయినప్పటికీ బడ్జెట్లో మాత్రం భారీగా కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఒక్క పథకానికే 20వేల కోట్లు కేటాయించేలా బడ్జెట్ తయారు చేస్తున్నారని సమాచారం. దీంతో ఈ పథకానికి తగ్గింపులు చేయలనేది సమస్యగా మారనుంది. అయితే దేనికీ కేటాయింపులు తగ్గించకుండా దళిత బంధును అమలు చేసేలా ఆర్థికశాఖ అధికారులు కుస్తీలు పడుతున్నారు.
ఈ పథకం అమలు వల్ల తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు తమకు మరలుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి పది లక్షలంటే ఉత్తరాది దళిత కుటుంబాల్లో ఈ పథకానికి మంచి గుర్తింపు దక్కనుంది. దళితబంధు, రైతుబంధు పథకాలతో జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ ప్రచారం చేసుకోనుంది. ఇవన్నీ అనుకూలిస్తే సీఎం కేసీఆర్ గుజరాత్ తోపాటే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
Also Read: రాజభవనాలు వదిలి అద్దె ఇళ్లల్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్లు వీళ్లే..!