Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే.. నాలుగు దశాబ్దాల అనుభవం.. పైగా ఎక్కువ కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగిన ఘనత కూడా చిరుకే దక్కింది. అయితే, ఇన్నేళ్ల కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో చిరు ఆడిపాడాడు. కానీ ఏ సినిమాలోనూ అతిగా రొమాన్స్ చేయలేదు. కానీ.. మీకు తెలుసా ? చిరు కూడా ఇప్పటి విజయ్ దేవరకొండలా ఒకప్పుడు లిపి కిస్ పెట్టాడు అని. ఏ సినిమాలో అనుకుంటున్నారా ? కానీ ఆ సినిమాలో ఆ సీన్ ఇప్పుడు లేదు.
ఇంతకీ చిరు ఎవరికీ లీప్ కిస్ పెట్టాడు అంటే.. హాట్ బ్యూటీ ‘నగ్మా’కి. నగ్మాతో చిరంజీవి కెమిస్ట్రీ అప్పట్లో బాగా కుదిరింది. ముందుగా మేనకతో మొదలు పెట్టి, ఆ తర్వాత మాధవి, రాధిక, రాధ లతో కూడా చిరు తనదైన శైలిలో రొమాన్స్ చేశాడు. ఇక ఆ తర్వాత తరంలో విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ, రోజాలతో కూడా చిరు అద్భుతమైన కెమిస్ట్రీని నడిపాడు.
Also Read: నిస్సారమైన బడ్జెట్ పై ప్రశంసాలా?
ఆ తర్వాత జనరేషన్ హీరోయిన్ల విషయానికి వస్తే.. సాక్షి శివానంద్, సిమ్రాన్ నుంచి ఇప్పటి తరంలో కాజల్, నయనతార, తమన్నా వరకు ఇలా అందరి హీరోయిన్స్ తో చిరు రొమాంటిక్ మూమెంట్స్ తో ఫుల్ కిక్ ఇచ్చాడు. అయితే, చిరు కెరీర్ లోనే బెస్ట్ కెమిస్ట్రీని పండించిన హీరోయిన్లు ఇద్దరు. ఒకరు నగ్మా, మరొకరు సౌందర్య. అయితే, చిరు లిప్ కిస్ విషయానికి వస్తే.. చిరంజీవి ఏ సినిమాలో కిస్ పెట్టారంటే.. ఘరానా మొగుడు సినిమాలో.
తన దేవీ ఫీలింస్ ప్రొడక్షన్ బ్యానర్ పై కె. దేవీ వరప్రసాద్ గారు చిరంజీవిని హీరోగా పెట్టి ఈ ఘరానా మొగుడు చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఆయనకు ఎప్పటి నుంచో చిరుతో ఒక మంచి మాస్ సాంగ్ చేయాలని కోరిక ఉంది. అందుకే.. ఈ సినిమాలో పండు పండు అనే ప్రత్యేక పాటను పెట్టారు. దర్శకుడు రాఘవేంద్రరావు బలవంత పెట్టి మరీ.. ఈ పాటలో లిప్ లాక్ సీన్ పెట్టారు.
చిరంజీవికి ఆ సీన్ చేయడం అస్సలు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం అంటూ రాఘవేంద్రరావు మెగాస్టార్ పై ఒత్తిడి తెచ్చి.. మొత్తానికి నగ్మాకు లిప్ కిస్ పెట్టించాడు. కానీ, చిరంజీవి సినిమా రిలీజ్ అయ్యే సమయంలో పట్టుబట్టి మరీ ఎడిటింగ్ రూమ్ లోకి వచ్చి.. ఆ సీన్ ను తీయించేశారు. అలా ఈ సినిమాలో ‘చిరు – నగ్మా’ల లిప్ కిస్ మిస్ అయ్యింది.
అన్నట్టు చిరు తన కెరీర్‌లో ఓ సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి సినిమా ‘ఘరానా మొగుడు’నే. అప్పట్లో ఈ సినిమా 10 కోట్లను కొల్లగొట్టింది. ఇవి ఆ రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్.
Also Read: చలో విజయవాడ సక్సస్.. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనా?