https://oktelugu.com/

తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

కరోనా వైరస్ మొదలైనప్పుడు సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇస్తుంటే చూసి మురిసిపోయాం.. ఆ తర్వాత కేసుల తీవ్రత పెరుగుతున్నకొద్దీ కేసీఆర్ మీడియాకు దూరమైపోతుంటే కంగారుపడ్డాం. ఇప్పుడు మహమ్మారి తెలంగాణలో విలయతాండవం చేస్తుంటే కళ్లప్పగించి చూడడం మినహా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు జెట్ స్పీడుగా కేసులు పెరిగి మళ్లీ 1500 అటూ ఇటూగా నమోదవుతున్నాయి. అయితే ఆది నుంచి కరోనా టెస్టులు చేయడంలో.. కేసులు.. మరణాలు వెల్లడించడంలోనూ తెలంగాణ సర్కార్ కావాలనే నిర్లక్ష్యం వహిస్తోందనే […]

Written By:
  • admin
  • , Updated On : July 24, 2020 8:31 pm
    Telangana
    Follow us on

    Telangana

    కరోనా వైరస్ మొదలైనప్పుడు సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇస్తుంటే చూసి మురిసిపోయాం.. ఆ తర్వాత కేసుల తీవ్రత పెరుగుతున్నకొద్దీ కేసీఆర్ మీడియాకు దూరమైపోతుంటే కంగారుపడ్డాం. ఇప్పుడు మహమ్మారి తెలంగాణలో విలయతాండవం చేస్తుంటే కళ్లప్పగించి చూడడం మినహా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు జెట్ స్పీడుగా కేసులు పెరిగి మళ్లీ 1500 అటూ ఇటూగా నమోదవుతున్నాయి. అయితే ఆది నుంచి కరోనా టెస్టులు చేయడంలో.. కేసులు.. మరణాలు వెల్లడించడంలోనూ తెలంగాణ సర్కార్ కావాలనే నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలున్నాయి. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలు కరోనాతో అల్లకల్లోలం అవుతుంటే హైదరాబాద్ లో మాత్రం కరోనా కేసులు.. మరణాలు తక్కువ చూపించడంపై అందరిలోనూ సందేహాలున్నాయి.

    Also Read: పీవీ కూతురుకు ఎమ్మెల్సీ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

    ఆ అనుమానాలుకు బలాన్ని ఇచ్చేలా ఉన్న ఓ వీడియో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. తెలంగాణలోని ఎర్రగడ్డ శ్మశానవాటికలో 50 మంది కరోనా మృతదేహాలకు సామూహిక ఖననం నిర్వహించిన వీడియోను తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణలో ఇంతమంది చనిపోతుంటే ప్రభుత్వం మాత్రం నిజాలు దాస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం లెక్కలు దాచిపెడుతోందని ఆమె ఆడిపోసుకున్నారు.

    హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో కరోనా మరణాలు బాగానే చోటుచేసుకుంటున్నాయి. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. టెస్టులు సంఖ్య పెంచిన కేసీఆర్ సర్కార్ ఆ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని తెలిసింది. కానీ గడిచిన కొన్ని రోజులుగా ఠంచనుగా 1500కు అటూ ఇటూ గానే కేసులు బులిటెన్ లో వస్తుండడం అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఏకంగా 7వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కానీ మెట్రో నగరం ఉన్న హైదరాబాద్ తో కూడిన తెలంగాణలో 1500 కేసులు మాత్రమే నమోదు కావడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

    Also: టీఆర్ఎస్ నేత కోసం బీజేపీ ఎదురుచూపు?

    కాగా తెలంగాణలో కరోనా మృతదేహాల సామూహిక ఖననంపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. రమేశ్ రెడ్డి స్పందించారు. జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ సమస్యల కారణంగా కరోనా మృతదేహాలను తరలించలేదని.. ఎర్రగడ్డ శ్మశాన వాటికకు 2, 3 రోజుల్లో కరోనాతో చనిపోయిన వారందరినీ ఒకేసారి తరలించి దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ సమస్యల కారణంగా ఇలా చేయాల్సి వచ్చిందన్నారు.

    ప్రస్తుతం కేసులు.. తీవ్రతను బట్టి చూస్తుంటే తెలంగాణలో సామూహిక వ్యాప్తి మొదలైందని అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ సర్కార్ కేసులు, మరణాలు దాస్తోందని అర్థమవుతోంది. ఇదే నిజమైతే వచ్చే నాలుగు వారాల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. లేదంటే కరోనా కల్లోలానికి బలి కాక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.