https://oktelugu.com/

కాంగ్రెస్ చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుందా?

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తన అమ్ములపొదిలో ఉన్న చివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడుతోంది. త్వరలో జరుగబోయే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తనశక్తినంతా ఉపయోగించి పార్టీని గాడిపెట్టేందుకు యత్నిస్తుంది. పదేళ్లుగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండటంతో పార్టీలోని నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే ఆపార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారనున్నాయి. Also Read: సోనియా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 24, 2020 / 08:22 PM IST
    Follow us on

    ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తన అమ్ములపొదిలో ఉన్న చివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడుతోంది. త్వరలో జరుగబోయే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తనశక్తినంతా ఉపయోగించి పార్టీని గాడిపెట్టేందుకు యత్నిస్తుంది. పదేళ్లుగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండటంతో పార్టీలోని నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే ఆపార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారనున్నాయి.

    Also Read: సోనియా గాంధీని నమ్ముకుంటే నిండా మునిగినట్లే

    ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మినహా ఎక్కడా అధికారంలో లేదు. మోదీ-షా వ్యూహాలకు కాంగ్రెస్ నిలదొక్కులేకపోతోంది. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి వయోభారం పార్టీకి సమస్యగా మారుతోంది. ఇక ఆమె తనయుడు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పెద్దగా సుముఖత చూపడంలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీని ఎవరు గాడిలో పెడుతారనే సందేహాలు కలుగకమానదు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన చివరి అస్త్రాన్ని యూపీ ఎన్నికల్లో ప్రయోగించేందుకు సిద్ధం అవుతోంది.

    దేశంలో ఓ సెంటిమెంట్ కొనసాగుతోంది. యూపీలో ఎవరైతే అత్యధిక స్థానాలు గెలుపొందుతారో వారే ఢిల్లీలో గద్దెనెక్కుతారు. దీంతో ఆ సెంటిమెంట్ కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. యూపీలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించబోతుంది. యూపీలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అయితే గాంధీ కుటుంబంపై యూపీ ప్రజలకు బలమైన సెంటిమెంట్ ఉండటంతో ఆ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించనుంది. ఈమేరకు ప్రియాంక సైతం ప్రత్యక్ష రాజకీయాలకు సై అనడంతో యూపీలో ఇప్పటి నుంచి ఎన్నికల సందడి మొదలు కానుంది.

    ఇప్పటివరకు ప్రియాంకా గాంధీ అమేథీ, రాయబేరిలో మాత్రమే గతంలో ప్రచారం చేశారు. సోనియా, రాహుల్ కోసం ఆమె ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి వారి గెలుపు కోసం కోసం చేశారు. ఇప్పుడు నేరుగా యూపీ ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఆసక్తిని రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లోనూ లబ్ధిపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రియాంకగాంధీని కాంగ్రెస్ రంగంలోకి దింపుతోంది.

    Also Read: పీవీ కూతురుకు ఎమ్మెల్సీ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

    2024 లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారడంతో కాంగ్రెస్ తన అమ్ములపొదిలోని బ్రహ్మస్త్రాన్ని ప్రియాంక రూపంలో ప్రయోగించబోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గట్టెక్కిస్తారో లేదో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తేలిపోవడం ఖాయంగా కన్పిస్తుంది.