https://oktelugu.com/

సుశాంత్ సింగ్ కేసులో అసలు విషయం పక్కదారి పడుతోందా?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే.. బాలీవుడ్లో నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడనే నెటిజన్లు విమర్శకులు గుప్పించారు. దర్శక నిర్మాత కరణ్ జోహర్ స్థాయి నుంచి బాలీవుడ్లో వారసత్వంతో అవకాశాలు దక్కించుకుంటున్న చిన్న, పెద్ద స్లార్లను ఎవరినీ కూడా నెటిజన్లు టార్గెట్ చేశారు. Also Read: సుశాంత్-రియా కలిసే డ్రగ్స్ వ్యాపారం చేశారా? సుశాంత్ ను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 10:52 AM IST

    sushant case

    Follow us on

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే.. బాలీవుడ్లో నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడనే నెటిజన్లు విమర్శకులు గుప్పించారు. దర్శక నిర్మాత కరణ్ జోహర్ స్థాయి నుంచి బాలీవుడ్లో వారసత్వంతో అవకాశాలు దక్కించుకుంటున్న చిన్న, పెద్ద స్లార్లను ఎవరినీ కూడా నెటిజన్లు టార్గెట్ చేశారు.

    Also Read: సుశాంత్-రియా కలిసే డ్రగ్స్ వ్యాపారం చేశారా?

    సుశాంత్ ను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులు సుశాంత్ ఆత్మహత్య కేసుపై విచారణ చేపట్టారు. ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో అనేక సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మీడియా కూడా ఈ కేసుపై ఇంట్రెస్ట్ చూపుతూ అనేక విషయాలను పోలీసుల కంటే ముందుగానే ప్రజల్లోకి తీసుకెళుతూ సంచలనాలను సృష్టిస్తోంది.

    సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా అతడిని ఎవరైనా హత్య చేశారా? అనే విషయాన్ని తేల్చాల్సిన పోలీసులు ఇప్పుడు అంతగా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతోన్నారు. గత కొద్దిరోజులుగా కేసు విచారణ జరుగుతున్న విషయాన్ని పరిశీలిస్తే పోలీసులు అసలు విషయాన్ని పక్కకు వదిలినట్లే కన్పిస్తోంది. కేవలం డ్రగ్ కేసుపైనే పోలీసులు ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తుంది. అంతేకాకుండా ఈ కేసులో సుశాంత్ సింగ్ రియా చక్రవర్తితో కలిసి డ్రగ్స్ దందా చేసినట్లు వార్తలు వస్తుండటంతో ప్రజల్లో అనుమానాలు రెకెత్తుతోన్నాయి.

    డ్రగ్ కేసులో ఇప్పటికే పోలీసులు రియా చక్రవర్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాను సుశాంత్ తో కలిసి డ్రగ్స్ కొనుగోలుకు ఫైనాన్స్ చేసినట్లు రియా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సైతం రియా ఆదేశాలతోనే సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నాడట. డ్రగ్ డీలర్ బాసిత్ కూడా సుశాంత్-రియాల ద్వారా మిగతావారికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో ఈ కేసులో మొత్తానికి రియా చక్రవర్తి బలవుతున్నట్లు కన్పిస్తోంది.

    Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. !

    కేసు విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం హీరో అయినా సుశాంత్ సింగ్ ను విలన్ గా చూపించే ప్రయత్నం బాగానే జరుగుతున్నట్లు కన్పిస్తోంది. దీనిని సుశాంత్ అభిమానులు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. బాలీవుడ్లోని స్టార్ల పేర్లను రియా చక్రవర్తి పోలీసులు విచారణలో వెల్లడించడంతో కేసు పక్కదారి పడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో సుశాంత్ ఆత్మహత్య మిస్టరీ ఇప్పట్లో వీడే అవకాశం కన్పించడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.