https://oktelugu.com/

అమెరికాలో భారతీయ ఓటర్ల మద్దతు ట్రంప్‌కేనా..?

అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎలక్షన్లకు టైం రానే వచ్చింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంది. గత టర్మ్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపొందగా.. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మరోమారు బరిలో నిలిచారు ట్రంప్‌. అటు డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్‌, ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్‌ బరిలో నిలుస్తున్నారు. అయితే.. తాజా ఎన్నికల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 10:48 AM IST

    indo american

    Follow us on

    అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎలక్షన్లకు టైం రానే వచ్చింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంది. గత టర్మ్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపొందగా.. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మరోమారు బరిలో నిలిచారు ట్రంప్‌. అటు డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్‌, ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్‌ బరిలో నిలుస్తున్నారు. అయితే.. తాజా ఎన్నికల్లో ఇప్పుడు ‘హిందూ- అమెరికన్‌’ అనే కొత్త నినాదం వినిపిస్తోంది.

    Also Read: చైనా బరితెగింపు వెనుక అసలు కారణమేంటి?

    హిందువులపై జరిగిన జాతి వివక్ష దాడుల్లో నిందితులను శిక్షించడానికి, ఆలయాలను కాపాడడానికి డెమొక్రాటిక్‌ పార్టీ కట్టుబడి ఉందని “హిందూ అమెరికన్స్‌ ఫర్‌ బైడెన్‌’’ అనే ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ చెప్పుకుంటోంది. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో హిందూ అమెరికన్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ఇదే ఫస్ట్‌ టైం. ఆగస్టు 14న ‘హిందూ వాయిసెస్‌ ఫర్‌‌ ట్రంప్‌’ ప్రచారం ప్రారంభం కావడంతో దేశంలోని లక్షల మంది హిందువులను ఆకర్షించడానికి ఈ ప్రచారం ప్రారంభించాల్సి వచ్చినట్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మురళీ బాలజీ తెలిపారు.

    ‘హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్’ పేరిట చేపట్టిన ప్రచారంలో పరోక్షంగా ట్రంప్‌ పాలనను గుర్తు చేస్తూనే, హిందువులపై విద్వేష నేరాలు మూడురెట్లు పెరిగాయని ప్రచారం చేస్తున్నారు. ‘2015లో హిందువులపై కేవలం ఐదుచోట్లే దాడులు జరిగాయనీ.. 2019లో సంఖ్య 14కి పెరిగిందని అంటున్నారు. గత నాలుగేళ్లలో విద్వేష, వివక్ష దాడులు పెరిగినట్లు ఇండియన్‌ అమెరికన్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు.

    ఇక హిందూ వాయిసెస్‌ ఫర్‌‌ ట్రంప్‌ అందించిన లెక్కల ప్రకారం.. అమెరికాలో 662 హిందూ దేవాలయాలు ఉన్నాయట. భారతీయ అమెరికన్లు చాలాకాలం నుంచి డెమొక్రాట్లకు మద్దతు ఇస్తూ వస్తుండగా.. భారత సంతతికి చెందిన దాదాపు 45 లక్షల మంది ప్రజలు అమెరికాలో ఉంటున్నారు. 8 రాష్ట్రాలలో 13 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. అయితే.. 2016లో భారత అమెరికన్లలో కేవలం 16 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు ఓటు వేశారు.

    Also Read: కాంగ్రెస్‌లో సీనియర్‌‌ నేతలు వర్సెస్‌ యువనేతలు

    అయితే ఈసారి ట్రంప్‌ మద్దతుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డెమొక్రాట్ ఇండియన్ అమెరికన్లలోని ఒక విభాగం భావిస్తోంది. అమెరికాలో నిర్వహించిన హౌడీ–మోదీ కార్యక్రమానికి ట్రంప్ హాజరు కావడం, ఆ తర్వాత ఆయన భారత పర్యటన కూడా చేయడంతో చాలామంది భారతీయ అమెరికన్లు, ముఖ్యంగా హార్డ్‌ కోర్‌ హిందువులు ట్రంప్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని డెమొక్రాట్లు భావిస్తున్నారు.