75ఏళ్ల భారతంలో రిజర్వేషన్లు అవసరమా?

స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో అణగారిన వర్గాలను పైకి లేపాలని రిజర్వేషన్లు అమలుపరిచారు. అది న్యాయమే.. ఆ రిజర్వేషన్లతో వారు చాలా లాభపడ్డారు. అత్యున్నత పదవులు, ఉద్యోగాలు పొందరు. అగ్రవర్ణాలను మించి సంపాదించారనే అపవాదు ఉంది. ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత కూడా ఆర్థికంగా పురోగమించిన వేళ ఆయా వర్గాలకు రిజర్వేషన్లు అవసరమా? రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ, ఉపాధి, పదవుల్లో చితికిపోయి దిగజారిన అగ్రవర్ణాలను పట్టించుకునే వారేరి. పెరిగిపోయిన బీసీల్లో రిజర్వేషన్ల వల్ల విపరీతమైన పోటీతో ఉద్యోగాలు కోల్పోతున్నారు. […]

Written By: NARESH, Updated On : March 20, 2021 9:21 am
Follow us on

స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో అణగారిన వర్గాలను పైకి లేపాలని రిజర్వేషన్లు అమలుపరిచారు. అది న్యాయమే.. ఆ రిజర్వేషన్లతో వారు చాలా లాభపడ్డారు. అత్యున్నత పదవులు, ఉద్యోగాలు పొందరు. అగ్రవర్ణాలను మించి సంపాదించారనే అపవాదు ఉంది. ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత కూడా ఆర్థికంగా పురోగమించిన వేళ ఆయా వర్గాలకు రిజర్వేషన్లు అవసరమా? రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ, ఉపాధి, పదవుల్లో చితికిపోయి దిగజారిన అగ్రవర్ణాలను పట్టించుకునే వారేరి. పెరిగిపోయిన బీసీల్లో రిజర్వేషన్ల వల్ల విపరీతమైన పోటీతో ఉద్యోగాలు కోల్పోతున్నారు. వారి సంగతేంది? ఇలా ఎన్నో ప్రశ్నలు.. రిజర్వేషన్లు ఉంచాలని అణగారిన వర్గాలు.. వద్దని బీసీలు, అగ్రవర్ణాలు డిమాండ్ చేస్తున్నారు. ఏది కరెక్ట్ ? దీనిపై సుప్రీంకోర్టుకు కూడా ఈ సమస్య చేరింది.

విద్యా, ఉద్యోగాల్లో ఇంకెన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. మరాఠా కోటా అంశంపై విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఈ ప్రశ్నను సంధించింది. రిజర్వేషన్లపై ఉన్న 50శాతం పరిమితిని తొలగిస్తే తలెత్తే అసమానతలపై ఆందోళన వ్యక్తం చేసింది.

దేశ పరిస్థితులు మారాయి. స్వాతంత్ర్యం వచ్చినట్టు ఇప్పుడు అణగారిన వర్గాలు లేవన్నది వాస్తవం. రిజర్వేషన్లతో వారు చాలా లాభపడ్డారన్నది జగమెరిగిన సత్యమే. మారిన పరిస్థితుల్లో రిజర్వేషన్లు పున: సమీక్షించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర తరుఫున వాదించారు. కోటాలను నిర్దేశించే అంశాన్ని కోర్టులు, రాష్ట్రాలకే వదిలేయాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం కోటా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా 50శాతం కోటాను ుల్లంఘించిందన్నారు.

‘అయితే 50శాతం పరిమితి లేకుంటే దాని కారణంగా తలెత్తే అసమానతల పరిస్థితి ఏంటి? ఎన్ని తరాల పాటు దీన్ని కొనసాగిస్తారని’ సుప్రీంకోర్టు సంచలన ప్రశ్న వేసింది. దీంతో రిజర్వేషన్ల ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదని.. ప్రజల మధ్య అంతరం తగ్గిపోయిందన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు గ్రహించినట్టైంది.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటికీ ఈ కోటా అమలవుతోంది.అయితే రాష్ట్రాలు మాత్రం ఈ కోటాను అమలు చేయడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కోటా ఇప్పటికీ అమలు కావడం లేదు. కానీ తాజాగా కేసీఆర్ సర్కార్ మోడీ బాటలో నడిచాడు. 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని కీలకనిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మాత్రం ఇప్పటికీ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను జగన్ సర్కార్ అమలు చేయడం లేదు. ఈ క్రమంలోనే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.