https://oktelugu.com/

మళ్లీ లాక్ డౌన్..?

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 25800 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు పెట్టినా ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధిస్తుందా? అనేది చర్చ జరుగుతోంది. సీఎం ఉద్దవ్ ఠాక్రే తాజాగా కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ ను ఒక ఆప్షన్ గానే చూస్తున్నట్టు తెలిపారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2021 / 09:30 PM IST
    Follow us on

    మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 25800 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపింది.

    ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు పెట్టినా ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధిస్తుందా? అనేది చర్చ జరుగుతోంది. సీఎం ఉద్దవ్ ఠాక్రే తాజాగా కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ ను ఒక ఆప్షన్ గానే చూస్తున్నట్టు తెలిపారు. గతంలో మాదిరిగానే ప్రజలు కోవిడ్ నిబంధనలు స్వచ్చందంగా పాటించి వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు.

    ప్రతి ఒక్కరూ భయపడకుండా కరోనా టీకా వేయించుకుంటే వైరస్ మహమ్మారిని తరిమికొట్టవచ్చని ఉద్దవ్ తెలిపాడు. కరోనా రూల్స్ ను మహారాష్ట్రలో ఖచ్చితంగా పాటిస్తేనే వైరస్ను నిలువరించగలమన్నారు.

    మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతుండడంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు, ఆడిటోరియంలు, ప్రైవేటు కార్యాలయాలపై ఆంక్షలు విధించింది. 50శాతం ఆక్యూపెన్సీతోనే కార్యకలాపాలు కొనసాగించాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31వరకు విధించారు.

    దీంతో సగం లాక్ డౌన్ మళ్లీ మహారాష్ట్రలో మొదలైంది. ఇది పూర్తి లాక్ డౌన్ గా మారుతుందా.? కేసులు పెరుగుతాయా? అన్నది వేచిచూడాలి