Russia Ukraine War: ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాల ఆక్షేపాలను రష్యా పట్టించుకోవడం లేదు. తాననుకున్నది చేయడానికే పుతిన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాటో దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయడం లేదు దీంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా దాడులతో దేశం యావత్తు బిక్కుబిక్కుమంటోంది. అయినా రష్యా మాత్రం తగ్గడం లేదు. దీనికి ఉక్రెయిన్ సైతం తాము కూడా సిద్ధమేనని చెబుతున్నా ఇరు దేశాలకు నష్టమే జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రెండు దేశాలకు కలుగుతున్న నష్టం గురించి ఫోకస్ పెట్టాలనే ప్రపంచ దేశాల సూచనను సానుకూలంగా తీసుకుని చర్చలకు సిద్ధమేనని ప్రకటించిన సందర్భంలో బెలారస్ లో రెండు దేశాల ప్రతినిధులతో చర్చలు సాగుతాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇరు దేశాలకు నష్టం జరగొద్దనే విషయంలో చర్చలు సఫలం కావాలనే అందరు భావిస్తున్నారు.
Also Read: ఉక్రెయిన్ లోని భారతీయుల పై సోనూసూద్ ట్వీట్
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధాలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చిన విషయం అందరిలో భయం కలిగిస్తోంది. అణ్వస్త్రాలు ప్రయోగిస్తే ప్రపంచ మానవాళి పెను ప్రభావం ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయం అందరిలో వస్తోంది. అందుకే యుద్ధం అంత సవ్యం కాదని శాంతియుత మార్గమే శరణ్యమని అమెరికా లాంటి అగ్రదేశం కూడా సూచిస్తోంది.
నాటో దేశాలు రష్యాపై ప్రతీకార దాడులకు దిగుతాయనే భయం పుతిన్ లో పట్టుకుంది. దీంతో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతోనే పుతిన్ ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమని చెప్పినా యుద్ధం మాత్రం ఆపడం లేదు. కానీ ప్రపంచ దేశాలు మాత్రం ఉక్రెయిన్ కు అండగా నిలిచినా రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు.
రష్యా ఉక్రెయిన్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తే కలిగే నష్టంపైనే హెచ్చరికలు చేస్తున్నా పుతిన్ మాత్రం ఆదేశ ఆర్మీ చీఫ్ కు అణ్వాయుధాలు సిద్ధం చేయాలని సంకేతాలు ఇచ్చిన సందర్భంలో అందరిలో భయాం కలుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. రష్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం కొనసాగిస్తే కలిగే పరిణామాలను ఆపడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆరంభం.. బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్పాట్ లు ఇక భస్మీపటలమేనా?