Samyuktha Menon: పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రదారులుగా నిర్మించిన చిత్రం భీమ్లానాయక్. బ్రహ్మాండమైన రికార్డులతో దూసుకుపోతోంది. ప్రేక్షకుల అంచనాల మేరకు చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇక పవన్ కల్యాణ్, రానా నటనకు ప్రాణం పోసినట్లుగా చిత్రం రూపుదిద్దుకోవడం గమనార్హం.

ఈ సినిమాలో రానా(డేనియల్ శేఖర్)కు భార్యగా నటించిన సంయుక్త మీనన్ నటనకు కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆమె పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె క్లైమాక్స్ లో చూపిన నటన అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.
ఇప్పుడు అందరి ఫోకస్ ఆమెపై పడింది. మళయాలంలో బిజీగా ఉన్న హీరోయిన్ సంయుక్త మీనన్. తెలుగులో ఇదే మొదటిచిత్రమైనా ఆమె పాత్రలో ఒదిగిపోయి నటించడం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సహజమైన నటనతో అందరిని మెప్పించింది. సినిమాలో నిత్యామీనన్ పవన్ కల్యాణ్ కు జోడీగా నటించగా రెండో హీరోయిన్ పాత్ర కోసం కూడా మళయాలం నటినే తీసుకోవాలని చిత్రం యూనిట్ భావించగా వారు వెతుకుతుండగా సంయుక్త పేరు తెరమీదకు వచ్చింది. దీంతో ఆమెను సంప్రదించగా ఆమె అంగీకరించడంతో ఆమెకు తెలుగులో అవకాశం దక్కింది.
Also Read: పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్.. భీమ్లానాయక్ అట్టర్ ఫ్లాప్ అట !
వచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. డేనియల్ శేఖర్ భార్యగా ఆమె నటించిన తీరు అందరిని మెప్పించింది. చక్కగా నటించి తన పాత్రకు జీవం పోసింది. దీంతో తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు రావచ్చని తెలుస్తోంది. సినిమా చూసిన వారందరు ఆమె ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. భవిష్యత్ లో మరింత బిజీ నటిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

భీమ్లానాయక్ సినిమా కూడా మళయాలం సినిమాకు రీమేక్ కావడం తెలిసిందే. దీంతో రెండో హీరోయిన్ కోసం కూడా మళయాలం నుంచే తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకే సంయుక్త ను తీసుకున్నట్లు చెబుతున్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మళయాల సినిమాను తెలుగులో పునఃనిర్మించారు. ప్రస్తుతం తెలుగు నిర్మాతలందరు సంయుక్త డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు సమాచారం. ఒక్క సినిమాతో సంయుక్త తెలుగులో కూడా తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పటికే తమిళంలో నటించినా వారు ఆదరించకపోవడంతో తెలుగుపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
Also Read: భీమ్లానాయక్ టీమ్‌కు అదిరిపోయే పార్టీ.. ఇచ్చింది ఎవరనుకున్నారు..?

[…] Also Read: డేనియల్ శేఖర్ భార్య ఎవరో తెలుసా? […]
[…] prabhas radhe shyam movie: మరో పది రోజుల్లో రాధేశ్యామ్ రానుండగా చిత్ర బృందం ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ అనిపించుకోగా, మార్చ్ 2న ముంబైలో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ లో 2వ ట్రైలర్ వదులుతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి రాజమౌళి కూడా జత కలిశారు. ముఖ్య ఘట్టాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మరో విషయం ఏంటంటే, తన బీజీఎంతోనే 50% విజయాన్ని అందించే తమన్, క్లైమాక్స్‌లో అదిరిపోయే బీజీఎం ఇచ్చాడట. […]
[…] Prabhas Adipurush Release Date: ప్రభాస్ మూవీ ఆదిపురుష్ కోసం ఇప్పుడు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదలపై నిర్మాత భూషన్ కుమార్‌ను దీపావళికి విడుదలువుతుందా అని ఓ మీడియా ప్రశ్నించగా.. చాలా సినిమాలు ఇప్పటికే దీపావళికి విడుదల తేదీలను ప్రకటించాయి. దీంతో దీపావళికి ఆదిపురుష్ రాదని క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన 2022 ముగింపులో నన్న ఆదిపురుష్ వస్తుందోమే చూడాలి. […]