Bollywood Crazy Updates: బాలీవుడ్ : వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !
Bollywood Crazy Updates: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన కొత్త చిత్రం కోసం కసరత్తు మొదలుపెట్టింది. కరణ్ జోహార్ నిర్మాణంలో రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. కాగా ఈ సీనిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ చిత్రంలో మహేంద్రగా రాజ్‌కుమార్, మహిమగా జాన్వీ పాత్రలు ఉండనున్నాయి. https://www.instagram.com/p/CZLiVXvIvvt/ ఇక ఈ చిత్రంలోని తన […]
Written By:
, Updated On : February 28, 2022 / 10:09 AM IST
Bollywood Crazy Updates: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన కొత్త చిత్రం కోసం కసరత్తు మొదలుపెట్టింది. కరణ్ జోహార్ నిర్మాణంలో రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. కాగా ఈ సీనిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ చిత్రంలో మహేంద్రగా రాజ్‌కుమార్, మహిమగా జాన్వీ పాత్రలు ఉండనున్నాయి.

Janhvi Kapoor
ఇక ఈ చిత్రంలోని తన పాత్ర కోసం క్రికెట్ ప్రాక్టీస్ ను ముమ్మరంగా మొదలు పెట్టింది జాన్వీ కపూర్. పైగా జిమ్ లో కంటే కూడా గ్రౌండ్ లోనే ఎక్కువ కష్టపడుతుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ తన క్రికెట్ ప్రాక్టీస్ కి సంబంధించి పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఈ యంగ్ బాలీవుడ్ బ్యూటీ తెగ ఎంజాయ్ చేస్తోంది.
Also Read: Keerthy Suresh: అతనితో జర్నీ చాలా బాగుంది.. సైడ్ బిజినెస్ పెట్టిన కీర్తి సురేష్
ఇక మరో మూవీ అప్ డేట్ విషయానికి వస్తే.. నిన్న 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ విషెస్ చెబుతోంటే, అందరికంటే భిన్నంగా ఉండాలని బిగ్ బీ అమితాబ్ చాలా కొత్తగా ప్రయత్నించారు. ఈ క్రమంలో తన పిల్లి గడ్డానికి త్రివర్ణ రంగు వేయించుకొని మరీ ఆ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పైగా అమితాబ్ ఈ డిఫరెంట్ ఫోటోతో పాటు ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశారు.

Amitabh Bachchan
కాగా ‘ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా’ అని మెసేజ్ కూడా పెట్టారు. చాలామంది అమితాబ్ చతురతకు ఫిదా అయితే, కొంతమంది ఇది అవమానకరంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. మొత్తమ్మీద బిగ్ బీ నిన్న చెప్పిన వెరైటీ విషెస్.. నేడు బాలీవుడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.