పార్టీ మారడానికి పెద్దిరెడ్డి సిద్ధమేనా?

హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీరణలు మారుతున్నాయి. బీజేపీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికతో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఈటల చేరడం నచ్చలేదని తెలుస్తోంది.దీంతో ఆయన అలకబూనారని ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీలో కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు. కారు ఎక్కడానికి కూడా సిద్ధమైనట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం హుజురాబాద్ ఇన్ చార్జిగా పెద్దిరెడ్డి కొనసాగుతున్నారు. కానీ ఆయనకు […]

Written By: Srinivas, Updated On : June 17, 2021 12:10 pm
Follow us on

హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీరణలు మారుతున్నాయి. బీజేపీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికతో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఈటల చేరడం నచ్చలేదని తెలుస్తోంది.దీంతో ఆయన అలకబూనారని ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీలో కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు. కారు ఎక్కడానికి కూడా సిద్ధమైనట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం హుజురాబాద్ ఇన్ చార్జిగా పెద్దిరెడ్డి కొనసాగుతున్నారు. కానీ ఆయనకు తెలియకుండానే ఈటల రాజేందర్ ను చేర్చుకోవడంతో ఆయన అలకబూనారు. ఈటలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల, పెద్దిరెడ్డి ఒకే ప్రాంతం వారు కావడంతో తన ప్రాబల్యం తగ్గిపోతుందని పెద్దిరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

పెద్దిరెడ్డి విషయంపై నాయకత్వం దృష్టి సారించింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పెద్దిరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది. డీకే అరుణను రంగంలోకి దింపింది. ఆయన మాత్రం శాంతించడం లేదని తెలుస్తోంది. ఈటల కారణంగా తన గుర్తింపు తగ్గిపోతుందని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా పెద్దిరెడ్డి కారు ఎక్కడానికి సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈటలకు ధీటైన నాయకుడు కావాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పెద్దిరెడ్డి గులాబీ పార్టీలో చేరితే ఈటలకు చెక్ పెట్టాలని చూస్తోంది. ఈటలను ఢీకొనే సత్తా ఉన్న నాయకుడి కోసమే అన్వేషిస్తున్నారు. పెద్దిరెడ్డి సత్తాపై ఇప్పటికే సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సర్వేలో పాజిటివ్ ఫలితం వస్తే పెద్దిరెడ్డిని కారు ఎక్కించుకునేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమైనట్లు సమాచారం.