Telangana: ధాన్యం కొనుగోళ్లు: తప్పు తెలంగాణదే అన్నట్టు?

Telangana: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. హుజురాబాద్ ఓటమి తరువాత బీజేపీని లక్ష్యంగా చేసుకుని సీఎం కేసీఆర్ విమర్శలకు దిగడం చూస్తున్నాం. ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలువరించే క్రమంలోనే ఆయన ఈ పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో […]

Written By: Srinivas, Updated On : December 21, 2021 7:44 pm
Follow us on

Telangana: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. హుజురాబాద్ ఓటమి తరువాత బీజేపీని లక్ష్యంగా చేసుకుని సీఎం కేసీఆర్ విమర్శలకు దిగడం చూస్తున్నాం. ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలువరించే క్రమంలోనే ఆయన ఈ పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు వాస్తవాలు వెల్లడించారు. కేసీఆర్ కుట్రలో భాగంగానే కేంద్రంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

Paddy purchases

తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. దీంతో టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ అధికారం చేపడితే తమకు దిక్కేంటనే ఆలోచనతోనే కేసీఆర్ మాట మారుస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే కేంద్రానికి ధాన్యం కొనుగోలుపై జరిగిన ఒప్పందాలను తోసిరాజని తన కథ చెప్పుకుంటున్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం మీద నెపం వేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

రబీ సీజన్ లో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం గురించి మాత్రం కేసీఆర్ మాట్లాడటం లేదు. అదనంగా 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు కేంద్రం అంగీకరించినా రాష్ర్టం మాత్రం సరఫరా చేయలేదు. పైగా కేంద్రమే కొనుగోలు చేయడం లేదని రైతులను తప్పుదోవ పట్టిస్తూ నాటకాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రైతుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ కు త్వరలోనే గుణపాఠం చెప్పడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.

Also Read: Cold Wave: భయపెడుతున్న చలి.. అప్రమత్తతే రక్షించాలి మరి

ప్రతి గింజ కొంటామని గతంలోనే ప్రకటించిన కేసీఆర్ ప్రస్తుతం మాట తప్పారు. కేంద్రంపై నిందలు వేసేందుకే ఆయన ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఇప్పటివరకు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగినా కేసీఆర్ కేంద్రంపై బురద జల్లేందుకే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ తీరులో మార్పు రాకపోతే ఆయనే సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలుస్తోంది.

Also Read: TRS vs BJP: బీజేపీకి చావుడప్పు కొట్టిన టీఆర్ఎస్

Tags