చిరంజీవి పాల్గొనడం లేదని ఇప్పటికి తెలిసిందా?

సినీహీరో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టి పదవీకాలం పూర్తి కాగానే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ ఇప్పటికి కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్లుగానే భావిస్తున్నారు. తాజాగా చిరంజీవి కాంగ్రెస్ లో కొనసాగడం లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిపై చర్చించేందుకు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. అందరితో పాటు చిరంజీవికి కూడా ఆహ్వానం పంపారు. […]

Written By: Raghava Rao Gara, Updated On : June 28, 2021 6:34 pm
Follow us on

సినీహీరో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టి పదవీకాలం పూర్తి కాగానే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ ఇప్పటికి కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్లుగానే భావిస్తున్నారు. తాజాగా చిరంజీవి కాంగ్రెస్ లో కొనసాగడం లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ ప్రకటించారు.

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిపై చర్చించేందుకు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. అందరితో పాటు చిరంజీవికి కూడా ఆహ్వానం పంపారు. కానీ ఆయన వైపు నుంచి స్పందన లేదు. దీంతో ఆయన పార్టీలో కొనసాగడం లేదని తేల్చారు. చిరంజీవి ఇప్పటివరకు రాజీనామా చేశానని కానీ రాజకీయాల నుంచి విరమించుకున్నానని గానీ ప్రకటించలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు ఎప్పటికైనా యాక్టివ్ అవుతారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆయన స్పందించకపోవడంతో ఇక ఉపేక్షించేది లేదని చిరంజీవి కాంగ్రెస్ లో కొనసాగడం లేదని తేల్చేశారు.

అందరు సమావేశాలకు వస్తున్నా ఒక్క ఆయనే రావడం లేదని చెబతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ సమావేశాలకు వస్తారో రారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ సేవలకు రారని తేల్చేయడం సముచితమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చిరంజీవి కేంద్ర మంత్రి పదవి పూర్తయ్యాక ఇక కనిపించలేదు. రాజీనామా చేయకపోయినా పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరు కావడం లేదు. దీంతో ఆయన పాత్రపై అందరిలో ఒకే సందేహం వ్యక్తం అవుతోంది. ఆయన పార్టీ సేవలకు దూరంగా ఉంటున్నారే కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.