https://oktelugu.com/

మోదీ సర్కార్ స్కూల్, కాలేజ్ ఫీజుల కోసం 11 వేలు ఇస్తోందా..?

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతోంది. పేద, మధ్య తరగతి వర్గాలు కరోనా వైరస్ వల్ల స్కూల్ పిల్లల ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. Also Read : జగన్ కేసీఆర్ మధ్య యుద్ధం మొదలైనట్లేనా..? అయితే ఇలాంటి సమయంలో మోదీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 22, 2020 / 05:43 PM IST
    Follow us on


    దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతోంది. పేద, మధ్య తరగతి వర్గాలు కరోనా వైరస్ వల్ల స్కూల్ పిల్లల ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

    Also Read : జగన్ కేసీఆర్ మధ్య యుద్ధం మొదలైనట్లేనా..?

    అయితే ఇలాంటి సమయంలో మోదీ సర్కార్ స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థుల కోసం 11 వేల రూపాయలు ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. దీంతో మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని సోషల్ మీడియా వేదికగా ప్రజలు పోస్టులు పెడుతున్నారు. మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఇలాంటి నిర్ణయాలు మరెన్నో తీసుకోవాలని.. కరోనా కష్టకాలంలో తమను ఆదుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ తో పాటు ఒక లింక్ కూడా ఉండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ నిజంగానే డబ్బులు ఇస్తోందని చాలామంది నమ్ముతున్నారు. అయితే వాస్తవం మాత్రం మరో విధంగా ఉంది. కేంద్రం అలాంటి కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకురాలేదు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించడం కోసం 11,000 రూపాయలు ఇవ్వడం లేదు.

    పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వైరల్ అవుతున్న లింక్ గురించి, వెబ్ సైట్ గురించి స్పందించి వివరణ ఇచ్చింది. కేంద్రం నుంచి ఏదైనా స్కీమ్ అమలులోకి వస్తే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లింక్ లను క్లిక్ చేసి సైబర్ మోసాల బారిన పడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలోని లింక్ లలో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని తెలుపుతున్నారు.

    Also Read : బీజేపీ షాక్ తో వెనక్కు తగ్గిన జగన్ సర్కార్..?