https://oktelugu.com/

బాబు పండిపోయాడు…లోకేష్ పచ్చిగానే ఉన్నాడు!

కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న టీడీపీ మూడు దశాబ్దాలకు పైగా తెలుగురాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరువాత సుధీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ ని ఏలిన పార్టీగా టీడీపీ నిలిచింది. 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్నవాడిగా రికార్డులకు ఎక్కారు. ఇది టీడీపీ ఘనమైన గత చరిత్ర. ఒక్క ఏడాదిలో ఆ పార్టీ ముఖ చిత్రమే మారిపోయింది. హేమాహేమీ నాయకులను ఎదుర్కొని ధీటుగా నిలిచిన టీడీపీ జగన్ దెబ్బకు దుకాణం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 26, 2020 / 11:24 AM IST
    Follow us on


    కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న టీడీపీ మూడు దశాబ్దాలకు పైగా తెలుగురాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరువాత సుధీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ ని ఏలిన పార్టీగా టీడీపీ నిలిచింది. 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్నవాడిగా రికార్డులకు ఎక్కారు. ఇది టీడీపీ ఘనమైన గత చరిత్ర. ఒక్క ఏడాదిలో ఆ పార్టీ ముఖ చిత్రమే మారిపోయింది. హేమాహేమీ నాయకులను ఎదుర్కొని ధీటుగా నిలిచిన టీడీపీ జగన్ దెబ్బకు దుకాణం సర్ధే పరిస్థితి ఏర్పడింది. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో అత్యంత గడ్డుకాలంగా దీనిని చెప్పుకోవచ్చు.

    Also Read: గవర్నర్ వ్యవస్థతో జగన్ ని ఆపడం సాధ్యమేనా..!

    టీడీపీ కీలక నాయకులు ఆపార్టీకి హ్యాండిచ్చేస్తున్నారు. పార్టీ మనుగడ అటుంచితే తమ భవిష్యత్ అగమ్య గోచరంగా మారడంతో వారు వైసీపీలోకి వలస బాటపడుతున్నారు. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో ముగ్గురు రెబెల్స్ గా మారగా, ఓడిన వారు వైసీపీతో స్నేహ హస్తం కోరుకుంటున్నారు. వచ్చే ఐదేళ్లలో నైనా టీడీపీ పుంజుకొని అధికారంలోకి వస్తుందన్న భరోసా వారిలో లేకపోవడమే ఈ వలసలకు కారణం. నియోజక వర్గాల ఇంఛార్జుల అభిప్రాయాల ఆధారంగా కొందరు టీడీపీ నేతలను జగన్ తమ పార్టీలో చేర్చుకోవడం లేదు. జగన్ సిద్ధాంతాలు పెట్టుకొని గేట్లు ఎత్తని పక్షంలో రానున్న కాలంలో బీజేపీలోకి భారీ వలసలు ఉండే అవకాశం కలదని నిపుణుల అంచనా.

    Also Read: రాజధాని రైతులపై పవన్ కి చిత్తశుద్ధి ఉందా?

    టీడీపీ కేడర్లో అభద్రతా భావం పెరిగిపోవడానికి నాయకత్వ లోపమే అనే మాట గట్టిగా వినిపిస్తుంది. తిమ్మిని బొమ్మిని చేయగల బాబుకి వృధాప్యం వచ్చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు 80కి చేరువ అవుతుంది. కాబట్టి ఆయన ఆలోచనలు, చర్యలు జగన్ స్పీడుకు అడ్డుకట్టవేయడం కష్టమే అనేది వారి ఆలోచన. ఇక బాబు వయోభారంతో రిటైర్ అయితే టీడీపీ పగ్గాలు లోకేష్ చేతిలోకి వస్తాయి. లోకేష్ రాజకీయ పరిపక్వత, ఆయనకు జనాల్లో ఉన్న ఇమేజ్ రీత్యా ఆయన పార్టీని నడిపించడం అనేది జరగని పనే. లోకేష్ నాయకత్వాన్ని నమ్మి వెనుక నడిచే నాయకులు ఉంటారా అంటే…అనుమానమే. చంద్రబాబు టీడీపీ పార్టీ ఎవరి చేతుల్లోకి పోకుండా ఉండాలనే ఆలోచనతో, తనకు ప్రత్యామ్నాయంగా ఎవరినీ నాయకుడిగా తీర్చిదిద్దలేదు. వారసుడు లోకేష్ నేమో నాయకుడిగా కేడర్ నమ్మడం లేదు. దీనితో బాబు తరువాత టీడీపీ నావను నడిపేది ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. రేపు 2024 ఎన్నికలలో టీడీపీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది కూడా ఆ పార్టీ విజయావకాశాలను నిర్ణయిస్తుంది.